- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
కరువు భత్యం విడుదల చేయాలి
Published Mon, Aug 15 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
విద్యారణ్యపురి : ఈ ఏడాది జనవ రి నుంచి బకాయి ఉన్న కరువు భత్యం వెంటనే విడుదల చేయాల ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలోని లష్కర్‌బజార్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం జనవరి 16 నుంచి 6 శాతం డీఏ ప్రకటించటమే కాకుండా 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు నూతన వేతనాలను అమలు చేయాలన్నారు. డీఏని తటస్థం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం డీఏ సూత్రాన్ని మార్చి అందుకు అనుగుణంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ, ఉమ్మడి సర్వీస్‌రూల్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.సదానంద్, జిల్లా అధ్యక్షు డు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అవారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, జిల్లా కార్యదర్శు లు ఎం.రాజేందర్, ఎం.అన్నాదేవి, పెండం రాజు, సీహెచ్.వీందర్‌రాజు, ఎ.మురళీకృష్ణ, డి.కిరణ్‌కుమార్, ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement