Published
Fri, Nov 4 2016 1:07 AM
| Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
4.5 ఎకరాల చెరకు తోట దగ్ధం
రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం
కోవూరు : విద్యుత్తు వైర్లు తెగిపడటంతో ఐదు ఎకరాల చెరకు తోట అగ్నికి ఆహుతైన సంఘటన మండలంలోని గంగవరంలో గురువారం చోటు చేసుకుంది. పందిళ్లపల్లి దయాకర్‌రెడ్డి గ్రామంలో 8 ఎకరాల్లో చెరకు పంట సాగు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో పంట మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంటు వైరు తెగి ఒక్కసారిగా తోటలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో దయాకర్‌రెడ్డి నెల్లూరు అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తోట వద్దకు చేరుకొని మంటలు అదుపు చేశారు. కాలిపోయిన చెరకు ఎందుకు పనిరాకపోవడంతో రైతు అయోమయస్థితిలో ఉన్నాడు. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు.