
చికిత్స పొందుతున్న యువకుడు
ఏడాదిగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వీరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాయి. ఇటీవల సత్తివేలు అన్నయ్యకు, జ్యోతి చెల్లెలు వివాహంపై జ్యోతి ఇంట్లో చర్చించారు. ఈ పెళ్లి ప్రస్తావన విషయంలో జ్యోతి, సత్తివేలు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. తవును వేరుచేసి తన అన్నయ్యకు జ్యోతిని, జ్యోతి చెల్లెల్ని తనకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారని భావించారు. దీంతో తీవ్ర వునస్తాపానికి గురైన ప్రేమికులు పంటపొలాల వద్దకు వెళ్లి పురుగుల మందు తాగేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న వీరిని స్థానికులు గుర్తించారు. వెంటనే వి.కోట సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. సత్తివేలు పరిస్థితి విషవుంగా ఉండడంతో కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. యువకుడు స్థానికంగా ఉన్న ప్రయివేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యువతి మృతితో కాలనీలో విషాదం నెలకొంది. సవూచారం అందుకున్న ఎస్‌ఐ రాజశేఖర్ వివరాలను ఆరా తీశారు.