'మొన్న జరిగిన ఘటన దురదృష్టకరం' | Sujana chowdary holy bath at vip ghat in rajahmundry | Sakshi
Sakshi News home page

'మొన్న జరిగిన ఘటన దురదృష్టకరం'

Published Fri, Jul 17 2015 11:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

Sujana chowdary holy bath at vip ghat in rajahmundry

రాజమండ్రి : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆకాంక్షించారు. గోదావరి పుష్కరాలు సందర్భంగా శుక్రవారం సుజనా చౌదరి రాజమండ్రిలోని వీఐపీ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడారు. మొన్న చోటు చేసుకున్న తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమన్నారు.

పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్లో తొక్కిసలాట సందర్భంగా చనిపోయిన వారి ఆత్మకు శాంతి చూకూరాలని కోరుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రకృతి సహకరించాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు.  గోదావరి పుష్కరాలకు ఇప్పటివరకు కోటి మంది భక్తులు హాజరయ్యారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం పుష్కర ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని సుజనా చౌదరి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement