కొటిపి చౌడేశ్వరీ ఆలయం.. చూసొద్దాం రండి | summer special of kotipi chowdeswari | Sakshi
Sakshi News home page

కొటిపి చౌడేశ్వరీ ఆలయం.. చూసొద్దాం రండి

Published Thu, Jun 1 2017 11:39 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM

కొటిపి చౌడేశ్వరీ ఆలయం.. చూసొద్దాం రండి - Sakshi

కొటిపి చౌడేశ్వరీ ఆలయం.. చూసొద్దాం రండి

భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా హిందూపురం మండలంలోని కొటిపి చెరువు వద్ద వెలసిన చౌడేశ్వరీ దేవి ఆలయం విరాజిల్లుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. తమ కోర్కెలు తీర్చాలని చీర, సారే, గాజులు సమర్పించి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ప్రతి మంగళ, శుక్రవారాలు, పౌర్ణమి రోజుల్లో ఆలయం వద్ద భక్తులు నిద్ర చేస్తుంటారు.

ఈ ఆలయాన్ని సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చోళులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రత్యేకత ఏమంటే అమ్మవారికి సమర్పించిన కానుకలను బహిరంగంగా పెట్టి ఉంటారు. వీటిని ఎవరూ తీసుకెళ్లారు. సంవత్సరాల తరబడి ఆలయం ముఖద్వారం వద్ద ఎడమవైపున ఉన్న నాగుల కట్ట వద్ద గుట్టగుట్టలుగా గాజులు, చీరలు పడేసి ఉంటారు. ఆలయానికి చేరుకోవాలంటే హిందూపురం నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించి కొటిపి చెరువును చేరుకోవాల్సి ఉంటుంది. హిందూపురం నుంచి ప్రత్యేకంగా ఆటోలు తిరుగుతుంటాయి. లేదంటే సొంత వాహనాల్లో వెళ్లి రావచ్చు.
- హిందూపురం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement