ముంపు భూముల సర్వే అడ్డగింత
నెల్లిపాక : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపునకు గురవుతున్న భూ ముల సర్వే పనులను నెల్లిపాక గ్రామస్తులు అడ్డుకున్నారు. నెల్లిపాక పంచాయతీలో సుమారు 582 ఎకరాల సాగు భూములు ముంపునకు గురవుతాయ ని అధికారులు గుర్తించారు. ఆ భూ ముల సర్వేను ఇంతవరకు చేపట్టకపోవ టంతో, అధికార పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భూములను సర్వే చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.మురళీమోహన్‌బాబు ఆదేశాల మేరకు మంగళవారం నుంచి సర్వే పనుల ను సర్వేయర్లు ప్రారంభించారు. భూములు మాత్రమే సర్వే చేయడంపై గ్రామంలోని వ్యవసాయ కూలీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు ప్యాకేజీలు ఇచ్చి, సర్వే చేసి న భూములు స్వాధీనం చేసుకుంటే తామెలా బతకాలంటూ అధికారుల తీరుపై మం డిపడ్డారు. బుధవారం ఉదయం సర్వే చేస్తున్న అధికారులను అడ్డగించారు. సమాచారం అందుకున్న ఎస్‌డీసీ సాయంత్రం నెల్లిపాక చేరుకుని గ్రామస్తులతో చర్చిం చారు. చిన్నపాటి గోదావరి వరదకే గ్రామం చుట్టూ నీరుంటుందని, ఇటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గ్రామం ముంపునకు గురికాదనడం సరైంది కాదని గ్రామస్తులు తెలిపారు. ముందుగా ఇళ్లను సర్వే చేసి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాకే రైతుల భూములకు సర్వే చేయాలని డిమాండ్ చేశారు. చేసేది లేక భూముల సర్వే నిలిపివేస్తున్నట్టు ప్రకటించి, అధికారులు వెళ్లిపోయారు.