opposed
-
దళిత వర్గమే కానీ... రిజర్వేషన్లు మాత్రం వద్దన్నారు!
ఆమె రాజ్యాంగసభలోని సభ్యురాలైనప్పటికీ కుల ప్రాతిపదికన కేటాయించే రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. మహిళలకూ ప్రత్యేకమైన రిజర్వేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆమె మరెవరో కాదు.. రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఏకైక దళిత మహిళా రాజ్యాంగ సభ సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలోని మొత్తం 389 మంది సభ్యులలో 15 మంది మహిళలున్నారు. నాడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు మహిళా సభ్యులు రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వీరు మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయలేదు. జర్నలిస్ట్ నిధి శర్మ రచించిన పుస్తకం 'షీ ది లీడర్: ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో మహిళా రాజకీయ నేతల గురించి లోకానికి అంతగా తెలియని కథనాలను అందించారు. పుస్తకం ప్రారంభంలో 1947, ఆగస్టు 28న షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గం అంశంపై చర్చిస్తున్నప్పుడు.. రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఏకైక దళిత మహిళా సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్ అని పేర్కొన్నారు. నాడు సభలో దాక్షాయణి వేలాయుధన్ ఇలా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగతంగా నేను ఎటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా లేను. దురదృష్టవశాత్తూ బ్రిటీష్ సామ్రాజ్యవాదం మనపై కొన్ని మచ్చలు మిగిల్చింది. మనం హెచుతగ్గులను చూసి భయపడుతున్నాం. అందుకే ఈ అంశాలన్నింటినీ అంగీకరించవలసి వచ్చింది. ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును తొలగించలేం. సీట్ల రిజర్వేషన్ కూడా ఒక రకమైన ప్రత్యేక ఎంపిక వంటిదే. అయినా మనం దీనిని సహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది అవసరమైన పరిణామం అని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. దాక్షాయణి వేలాయుధన్ ఎవరు? దక్షిణాయణి వేలాయుధన్ 1912, జూలై 15న నేటి ఎర్నాకులం(కేరళ) జిల్లాలోని చిన్న ద్వీపమైన ముళవుకడ్లో జన్మించారు. ఆమె పులయ సమాజానికి చెందినవారు. కుల వ్యవస్థలో వీరి సమాజం అట్టడుగున ఉండేది. ఈ సమాజంలోని వారు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. అంటరానితనం కారణంగా వారు బహిరంగ రహదారులపై నడవడాన్ని కూడా నిషేధించారు. దీనికితోడు ఈ సమాజానికి చెందిన స్త్రీలు తమ శరీరపు పైభాగాన్ని దుస్తులతో కప్పుకోవడాన్ని నిషేధించారు. ఈ విధంగా పులయ సమాజానికి చెందిన మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దళితులకు సంబంధించిన కాయాల్ సమావేశం 1913లో కొచ్చిలో జరిగినప్పుడు వేలాయుధన్ కుటుంబసభ్యులతో పాటు తరలివచ్చారు. అక్కడ వారి సమాజానికి తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ఇటువంటి సంఘటనలు వేలాయుధన్ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వేలాయుధన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1945లో దాక్షాయణి కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినేట్ అయ్యారు. ఈ కౌన్సిల్ ద్వారా 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు మరోవైపు ఆమె ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్)వారపత్రిక ‘జై భీమ్’లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూవుండేవారు. డాక్టర్ అంబేద్కర్‌ను విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అంబేద్కర్ రాజకీయాలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆయన చేసిన డిమాండ్‌ను ఆమె తీవ్రంగా విమర్శించారు. దాక్షాయణి వేలాయుధన్ 1978 జూలై 20న తన 66 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి.. -
అనితకు టికెట్ ఇవ్వొద్దు జనసేన బిగ్ షాక్..!
-
జోనల్ వ్యవస్థను ఒప్పుకోం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రభావితమయ్యే వర్గాలతో చర్చించకుండా వాటి పునర్వ్యవస్థీకరణ నిర్ణయం సరికాదని బీజేపీ అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, యువజన సంఘాలతో చర్చించిన తర్వాతనే జోన్లకు తుదిరూపం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర పురోగతిలో సమతౌల్యం లోపించే అవకాశం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఫ్రీ జోనా, ఏడో జోన్ లేదా ఆరో జోన్లో భాగమా అనే అంశం తేలకనే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. -
మన గొప్పలు కాదు... అల్లాహ్ గొప్పలు చెప్పుకోవాలి!
రమజాన్ కాంతులు రమజాన్ ఉపవాసాల విషయంలో కృపాసాగరుడైన అల్లాహ్ పురుషుల కంటె స్త్రీలకే ఎక్కువ రాయితీలు ఇచ్చాడు. స్త్రీలు కష్టాలకు గురి కాకుండా ఉండేందుకు అల్లాహ్ చేసిన మేలు ఇది. అలాగని స్త్రీలు కానీ, పురుషులు కానీ ఉపవాసాలు ఉండడం ద్వారా తామేదో ఘనకార్యం చేశానన్న భ్రాంతి నుంచి బయటపడాలి. ఈ సద్బుద్ధిని, అటువంటి సదవకాశాన్ని అనుగ్రహించిన అల్లాహ్‌కు వేనవేల కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఉపవాసం ఉండి మీరు అల్లాహ్కేదో గొప్ప మేలు చేయలేదు. వాస్తవంగా విశ్వాస భాగ్యంతోపాటు ఉపవాసం పాటించుకునే వెసులుబాటును ఇచ్చి అల్లాహ్ మీకు మేలు చేశాడని గుర్తుంచుకోవాలి. రేపు ప్రళయదినాన మీరు చేసిన నిర్వాకాలకు బదులుగా మీ సత్కర్మలన్నీ బాధితులకు పంచబడతాయి. అప్పుడు మీ వద్ద ఒక్క ఉపవాసం మాత్రమే ఉండిపోతుంది. మీ నిర్వాకం బారిన పడిన బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నా, ఒక్క ఉపవాస పుణ్యం కారణంగా వారందరి బాధ్యతను అల్లాహ్ తీసుకుని మిమ్మల్ని రయ్యాన్ అనే తలుపు గుండా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం మాని అల్లాహ్ గొప్పలు చెప్పుకోండి. ఆయన ఘనతా ఔన్నత్యాలను వేనోళ్ల కొనియాడండి అంటుంది దివ్యఖురాన్. – సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమరీ -
మాటల్లో మృదుత్వం... ఉపవాసి గొప్పతనం!
రమజాన్ కాంతులు పరలోకంలో స్వర్గద్వారాల్లో మనకు నచ్చిన ద్వారం గుండా ప్రవేశించే అర్హత పొందటానికి అతి సులభమైన మార్గం రమజాన్ ఉపవాసాలు. అందుకే రమజాన్ ఒక మహత్తరమైన మాసం. దీనిలోని ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఒక నియమానుసారంగా రేయింబవళ్లు గడిపేలా ప్రణాళిక వేసుకోవాలి. అందుకోసం రోజువారీ పనులను బేరీజు వేసుకుని ఏ పని ఏ సమయంలో చేయాలో నిర్ణయించుకుని సాధ్యమైనంత వరకు దాని ప్రకారమే నడచుకోవాలి. చాలామంది మహిళలు తమకు పెద్ద పెద్ద సూరాలు కంఠతా రావని తరావీహ్ నమాజులను అజ్ఞానంతో విడిచిపెడుతుంటారు. అది చాలా తప్పు. కంఠతా వచ్చిన చిన్న చిన్న సూరాలనైనా చదువుకోవచ్చు. నిలబడి చదవలేకపోతే కూర్చొని కూడా చదువుకునే వెసులుబాటు ఉందని గ్రహించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నోటిని అదుపులో ఉంచుకోవాలి. చాడీలు, నోటి దురుసుతనం, కాఠిన్యం, దుర్భాషలకు దూరంగా ఉండాలి. ఉపవాసి గొప్పతనం వారి మాటల మృదుత్వం ద్వారా ఉట్టిపడుతూ ఉండాలి. ఇదే దైవవిశ్వాసానికి చిహ్నం. ఈ సంవత్సరపు రమజాన్ మాసంలో పగలు అధికంగానూ, రేయి తక్కువగానూ ఉంటుంది. అందువల్ల మగ్రిబ్, ఇషా, ఫజ్ర్లు తొందరగా వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఉపవాస వ్రతంలో ఎదురయ్యే బాధలను ఓర్పుతో సహించగలిగితేనే అనంత కరుణామయుడైన అల్లాహ్ ప్రేమామృతాన్ని పొందే అదృష్టం కలుగుతుంది. – తస్నీమ్ జహాన్ -
ఖురాన్ చెప్పిన జీవనం!
రమజాన్ కాంతులు పవిత్రమైన ఈ రమజాన్ నెలలో ముఖ్యంగా ఖురాన్‌తో సంబంధాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే, మానవ మనుగడకోసం దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే, పవిత్రఖురాన్ అవతరణ మరో ఎత్తు. మానవులకు జీవితంలోని అన్నిరంగాల్లో మార్గదర్శకంచేసింది ఖురాన్. సామాజిక, సాంస్కృతిక, కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ తదితర సమస్త రంగాల్లో మానవుడు ఎలాంటì జీవన విధానాన్ని అవలంబించాలి, ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలో వివరంగా తెలియజేసింది. మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు సంభవించే వివిధ దశల్లో మార్గం చూపింది. మానవజీవితం ఎలా ఉండాలి? ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి? కుటుంబం, సమాజం, బంధుమిత్రులతో ఎలా మసలుకోవాలి? సమాజంలో ఒక మనిషికి మరోమనిషిపై తారసిల్లే బాధ్యతలేమిటి? వ్యాపార లావాదేవీలు, ఉద్యోగబాధ్యతలు ఎలా నిర్వహించాలి? పాలన సూత్రాలేమిటి? ఆచరించాల్సిన విలువలేమిటి? పరస్పర మానవసంబంధాలు పటిష్టంగా, అర్థవంతంగా, సామరస్యపూర్వకంగా మనగలగాలంటే ఏంచేయాలి? ఇత్యాదివిషయాలన్నీ పవిత్రఖురాన్ చర్చించింది. అందుకని ఈ పవిత్రనెలలో దీన్ని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోడానికి, ఆచరించడానికి, సర్వసామాన్యం చెయ్యడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి.చివరి బేసిరాత్రుల్లో’షబెఖద్ర్’ను అన్వేషించాలి. వీలున్నవారు ‘ఏతికాఫ్’పాటించాలి. ఫిత్రాలు చివరిరోజుల్లోనే చెల్లించడం శుభప్రదం. ప్రవక మహనీయులు ’షబెఖద్ర్ ’కోసం ఉపదేశించిన దు ఆ ‘అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ ఆఫ్ వఫుఆఫ్ అన్ని’ పఠిస్తుండాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సంపద సద్వినియోగంతోనే దైవ ప్రసన్నత
రమజాన్ కాంతులు మానవుల వద్ద ఉన్నదంతా దైవప్రసాదితమే. దాన్ని ఒక అమానతుగా దైవం మన దగ్గర ఉంచాడు. అందుకని ఆయన చూపినమార్గంలో, ఆయన ఆదేశించిన రీతిలో సద్వినియోగం చేసినప్పుడే దైవప్రసన్నత ప్రాప్తిస్తుంది. ఈ భావన ప్రతి విశ్వాసి హృదయంలో అనునిత్యం, నిరంతరం మెదులుతూ ఉండాలి. వాస్తవానికి జకాత్ వ్యవస్థ సమాజంలో ప్రజలకు ఆర్థికన్యాయం అందించే అపురూప సాధనం.ఇది ప్రజల హృదయాలనుండి స్వార్థం, సంకుచితత్వం, పిసినారితనం, కాఠిన్యం, ద్వేషం లాంటి దుర్గుణాలను దూరంచేసి, వాటిస్థానంలో ప్రేమ, పరోపకారం, త్యాగం, సహనం, సానుభూతి, స్నేహశీలత, ఔదార్యం, కారుణ్యంలాంటి అనేక ఉన్నత మానవీయ గుణాలను పెంపొందిస్తుంది. జకాత్‌ను రమజాన్ మాసంలోనే చెల్లించాలన్న నియమం ఏమీ లేకపోయినా, ఈ మాసం శుభాల దృష్ట్యా అధికశాతంమంది ప్రజలు ఈనెలలోనే జకాత్ చెల్లింపుకు ప్రాధాన్యతనిస్తారు. ఈమాసంలో చేసే దానధర్మాలకు అనేకరెట్లు పుణ్యం లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లాహ్ అందరికీ చిత్తశుద్ధితో జకాత్ చెల్లించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఫారూఖ్ జునైద్ -
సదాచరణలు
రమజాన్ కాంతులు హజ్రత్ అబూహురైరా (ర) కధనం ప్రకారం ముహమ్మద్ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ‘రమజాన్ వస్తూనే స్వర్గద్వారాలన్నీ తెరవబడతాయి. నరక ద్వారాలన్నీ మూసివేయబడతాయి. షైతానులు బంధించబడతారు’. సత్కార్యాభిలాషులైన దైవదాసులు రమజాన్ మాసంలో ఆరాధనల్లో, దైవవిధేయతలో నిమగ్నమైపోతారు. పగలంతా రోజా పాటిస్తూ, గ్రంధ పారాయణంలో గడుపుతారు. రాత్రిలోని ఒక పెద్దభాగం తరావీహ్, తహజ్జుద్, దుఆ, ఇస్తెగ్ ఫార్లలో వెచ్చిస్తారు. ఈ శుభాల ప్రభావం వల్ల సాధారణ విశ్వాసుల హృదయాలు కూడా ఆరాధనలు, సత్కార్యాలౖ వెపు మొగ్గి చెడులకు దూరంగా ఉంటాయి. ఈ విధంగా ఇస్లామ్, ఈమాన్ల భాగ్యం పొందిన ప్రజలు దైవభీతి, దైవప్రసన్నత,ౖ దెవవిధేయతల మార్గంలో సహజంగానే ముందుకుపోతారు. మానవ హృదయాల్లో ‘మంచి’ ‘సత్కార్యాభిలాష’ అన్నది ఏ కాస్త ఉన్నా అది దైవ ప్రసన్నత కోసం పరితపిస్తుంది. దీంతో ఏ చిన్న సదాచరణ చేసినా ఈ పవిత్రమాసంలో అనేకరెట్లు అధికంగా ప్రసాదించబడుతుంది. ఇతర మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం సదాచరణల విలువ అత్యంత అధికం. వీటన్నిటి ఫలితంగా ఇలాంటి వారికోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. నరకద్వారాలు మూసుకుపోతాయి. వీరిని అపమార్గం పట్టించడం షైతానుల వల్లకాని పని. దుష్కార్యాల వైపు ప్రేరేపించలేకపోయినప్పుడు షైతానులు బంధించబడినట్లే గదా! స్వర్గద్వారం తెరుచుకున్నది నరకమార్గం మూసుకున్నది దుర్మార్గుడైన సాతానుకు మనాదిగట్టిగ పట్టుకున్నది! వెనుకముందు చూడకుండ సత్కార్యములనాచరించు కురుస్తున్నది దైవకరుణ అన్నిచెడులను విస్మరించు!! – మదీహా అర్జుమంద్ -
విశాఖలో వివాదస్పదంగా ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు
-
ముంపు భూముల సర్వే అడ్డగింత
నెల్లిపాక : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపునకు గురవుతున్న భూ ముల సర్వే పనులను నెల్లిపాక గ్రామస్తులు అడ్డుకున్నారు. నెల్లిపాక పంచాయతీలో సుమారు 582 ఎకరాల సాగు భూములు ముంపునకు గురవుతాయ ని అధికారులు గుర్తించారు. ఆ భూ ముల సర్వేను ఇంతవరకు చేపట్టకపోవ టంతో, అధికార పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భూములను సర్వే చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.మురళీమోహన్‌బాబు ఆదేశాల మేరకు మంగళవారం నుంచి సర్వే పనుల ను సర్వేయర్లు ప్రారంభించారు. భూములు మాత్రమే సర్వే చేయడంపై గ్రామంలోని వ్యవసాయ కూలీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు ప్యాకేజీలు ఇచ్చి, సర్వే చేసి న భూములు స్వాధీనం చేసుకుంటే తామెలా బతకాలంటూ అధికారుల తీరుపై మం డిపడ్డారు. బుధవారం ఉదయం సర్వే చేస్తున్న అధికారులను అడ్డగించారు. సమాచారం అందుకున్న ఎస్డీసీ సాయంత్రం నెల్లిపాక చేరుకుని గ్రామస్తులతో చర్చిం చారు. చిన్నపాటి గోదావరి వరదకే గ్రామం చుట్టూ నీరుంటుందని, ఇటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గ్రామం ముంపునకు గురికాదనడం సరైంది కాదని గ్రామస్తులు తెలిపారు. ముందుగా ఇళ్లను సర్వే చేసి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాకే రైతుల భూములకు సర్వే చేయాలని డిమాండ్ చేశారు. చేసేది లేక భూముల సర్వే నిలిపివేస్తున్నట్టు ప్రకటించి, అధికారులు వెళ్లిపోయారు. -
శ్రీకాకులంలో అణుప్రకంపనలు
-
రాష్ట్ర విభజన అంగీకరించం-జేపీ