ప్రకృతి అందాల తీరం సూర్యలంక
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయిల్
బాపట్ల: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు సూర్యలంక కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయిల్ అన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ ఎమ్మెల్యేలతో కలిసి సూర్యలంక తీరానికి చేరుకున్న స్పీకర్ ఆదివారం ఉదయం తీరంలో పర్యటించారు. స్పీకర్‌ను హరితా రిసార్ట్స్‌లో బాపట్ల ఎంపీపీ మానం విజేత మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువాలతో సత్కరించారు. తీరంలో పర్యటించిన వారిలో ఢిల్లీ ఎమ్మెల్యేలు అల్కాలంబ, పరిమళచూసెస్, భావనగౌరే, టీడీపీ రాష్ట్ర నాయకుడు మానం బ్రహ్మయ్య ఉన్నారు.