నేటి నుంచి ఎస్వీవీయూ క్రీడాపోటీలు
నేటి నుంచి ఎస్వీవీయూ క్రీడాపోటీలు
Published Thu, Dec 1 2016 1:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
ముత్తుకూరు: శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 8వ అంతర్ కళాశాలల గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ మీట్ గురువారం నుంచి ప్రారంభంకానుందని ఎస్వీవీయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ సర్జనరావు వెల్లడించారు. ముత్తుకూరులోని మత్స్యకళాశాలలో బుధవారం అసోసియేట్ డీన్ డాక్టర్ కృష్ణప్రసాద్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రప్రథమంగా ఎస్వీవీయూ పరిధిలోని తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలు, తిరుపతిలోని డెయిరీ, ముత్తకూరులోని మత్స్యకళాశాలకు చెందిన 500 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారన్నారు. కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్నీ పోటీలను ప్రారంభిస్తారని వెల్లడించారు. 'ఆక్వా ఫ్రోలిక్' పేరుతో 5 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయన్నారు. రూ.9 లక్షల వ్యయంతో మత్స్యకళాశాల రజతోత్సవాల సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు భోజనంతో పాటు అవసరమైన అన్ని వసతులను కళాశాలలోనే సమకూరుస్తున్నామని, పోటీల చివరిరోజున చాంపియన్‌షిప్‌తో పాటు విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుందని చెప్పారు. గెలుపొందిన వారు జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఓఎస్‌ఏ ప్రభంజన్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement