నగరంలో స్వచ్ఛ సర్వే ప్రారంభం
విజయవాడ సెంట్రల్ : నగరంలో స్వచ్ఛసర్వేక్షణ్ సర్వే మంగళవారం ప్రారంభమైంది. చాంబర్లో కమిషనర్ వీరపాండియన్ చాంపర్‌లో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం సభ్యులు శ్రావణ్‌కుమార్, సీతారామిరెడ్డితో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన నివారణకు నమ్మా, పబ్లిక్ టాయ్‌లెట్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. లిట్టర్‌ఫ్రీ నగరంలో తీర్చిదిద్దామని, చెత్త విభజన, స్క్రాప్‌పార్క్, కాల్వగట్ల సుందరీకరణ, పోస్టర్ ఫ్రీ, సోలార్ సిటీగా మార్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మింగ్ విజయవాడ క్యాంపెయినింగ్‌లో భాగంగా కళాశాలల విద్యార్థులతో సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా గోడలపై రంగుల చిత్రాలు వేయించినట్లు వివరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. మూడురోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు బృంద సభ్యులు తెలిపారు. సమావేశంలో చీఫ్ ఇంజినీర్ ఆర్.అంకయ్య, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు పి.ఆదిశేషు, జె.వి.రామకృష్ణ, ఈఈలు గోవిందరావు, పీవీకే భాస్కర్ పాల్గొన్నారు.