‘దిమ్మె గులాబీ రంగులో ఉంది..నేను రాను’
ఎర్రుపాలెం: ప్రభుత్వం చేస్తున్న ప్రతిపనిలో పార్టీ ముద్ర కనిపించేలా చేయడాన్ని నిరసిస్తూ టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రం నుంచి గుంటుపల్లి గోపవరం వరకు రూ. 12 కోట్లతో బీటీ రోడ్డు విస్తరణ పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వర్రావు హజరయ్యారు. బహిరంగ సభ అనంతరం శంకుస్థాపన దిమ్మె ఆవిష్కరించారు. సభలో పాల్గొన్న మల్లు భట్టివిక్రమార్క దిమ్మె ఆవిష్కరణను మాత్రం బహిష్కరించారు. శంకుస్థాపన దిమ్మెను గులాబీ రంగులో ఏర్పాటు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.