
రెబ్బెన(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన తహశీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. శంకర్ అనే రైతు భూమికి సంబంధించిన రికార్డులను సరిచేసేందుకు ఎమ్మార్వో రమేష్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారిచ్చిన సూచనల మేరకు శనివారం ఎమ్మార్వోకు మండల కార్యాలయంలోనే రూ.2 లక్షలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసును ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ దర్యాప్తు చేస్తున్నారు.