నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు | tarbalins distributes nregs workers | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Published Sun, May 7 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

tarbalins distributes nregs workers

గుంతకల్లు రూరల్‌ : ఉపాధి హామీ పనుల నిర్వహణలో ఉపాధిహామీ సిబ్బంది నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏపీడీ విజయలక్ష్మి   హెచ్చరించారు. ఉపాధిహామీ పనుల్లో కూలీలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘ కూలీలకు ప్రాణ సంకటం’ అనే శీర్షికతో శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉపాధిహామీ ఏపీడీ విజయలక్ష్మి స్పందించారు. శనివారం తన సిబ్బందితో కలిసి వైటీ.చెరువు గ్రామంలో పర్యటించారు. పని ప్రదేశంలో నిలువ నీడ లేక కూలీలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి టార్పాలిన్లను పంపిణీ చేశారు.  ప్రతిరోజు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ టీఏ ప్రభాకర్, ఇతర సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement