ఉపాధికూలీలపై టీడీపీ నేతల దాష్టీకం
ఉపాధికూలీలపై టీడీపీ నేతల దాష్టీకం
Published Tue, May 9 2017 2:14 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
దెందులూరు : ఉపాధి హామీ పథకం పనులకు ఎందుకు రానివ్వరని అడిగారన్న అక్కసుతో టీడీపీ నేతలు దాడికి ఒడిగట్టారు. అర్ధరాత్రి వేళ దళిత కూలీల ఇంటికి వెళ్లి తల్లీకొడుకులను రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దెందులూరు మండలం కొవ్వలిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం ఉపాధి హామీ పథకం కింద కొవ్వలిలో చేపట్టిన చెరువు తవ్వకం పనులకు గ్రామానికి చెందిన కొందరు దళితులు వెళ్లారు. 7గంటలకే పనిలోకి రావాలని.. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందును అనుమతించేది లేదని టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. మరునాటి నుంచి కచ్చితంగా సమయానికి వస్తామని, ఒక్క రోజుకు అనుమతించాలని వారంతా ప్రాధేయపడ్డారు. అందుకు టీడీపీ నేతలు అంగీకరించకపోగా.. దళిత కూలీలను దుర్భాషలాడారు. ఆ రోజు కూలీలు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు పురమాయించిన కొందరు వ్యక్తులు ఆదివారం రాత్రి కొవ్వలిలో రాడ్లతో స్వైరవిహారం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కాలి జ్యోతి, ప్రవీణ్‌లను బయటకు రావాలని పిలిచారు. రాత్రిపూట ఎందుకని, ఏదైనా విషయం ఉంటే ఉదయం మాట్లాడుకుందామని జ్యోతి చెప్పింది. బస్ షెల్టర్ వద్ద గ్రామ టీడీపీ అధ్యక్షుడు కసుకుర్తి రామకృష్ణ ఉన్నాడని, ఆయన మిమ్మల్ని వెంటనే తీసుకు రమ్మంటున్నాడని ఆ వ్యక్తులు చెప్పారు. ఇందుకు జ్యోతి ససేమిరా అనడంతో టీడీపీ నేతలు పురమాయించగా వచ్చిన వ్యక్తులు దుర్భాషలాడారు. ‘ఇక్కడ మేం చెప్పిందే వేదం. రామకృష్ణ దగ్గరకు వచ్చారా సరేసరి లేదంటే మీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. దీంతో జ్యోతి కుమారుడైన ప్రవీణ్ ఇంట్లోంచి బయటకు రాగా.. అతనితో వాగ్వివాదానికి దిగా రు. ఇంతలో సుబ్బయ్య, నిట్టా చింతయ్య అనేవారు రాడ్లతో జ్యోతి, ఆమె కుమారుడిపై దాడికి తెగబడ్డారు. జ్యోతిని జుట్టు పట్టుకుని బస్‌షెల్టర్ వరకూ లాక్కెళ్లారు. ఈ ఘటనలో కాలి జ్యోతికి, ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ ప్రస్తుతం ఏలూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ బాధితుల ఫిర్యాదును అవుట్‌పోస్టు పోలీసులు తీసుకోకపోవడంతో కొవ్వలి గ్రామ దళితులు, బాధితుల బంధువులు నిరసన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
బాధితులు కాలి జ్యోతి, ప్రవీణ్‌లను వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ పరామర్శించారు. టీడీపీ నేతలు రాడ్లతో తమపై దాడి చేసిన వైనాన్ని, ఫిర్యాదు స్వీకరించని అవుట్‌పోస్టు పోలీసులు నిర్వాకాన్ని బాధితులు ఆయనకు వివరించారు. దళితులపై అర్ధరాత్రి దాడిగి తెగబడటం దుర్మార్గమని కోటగిరి శ్రీధర్, వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ ఇ¯ŒSచార్జి కొఠారు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. దళితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా నిలబడతామని వారు పేర్కొన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ అనంతశ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కేసులు నమోదు చేశాం
బాధితులు జ్యోతి, ప్రవీణ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దెందులూరు ఎస్సై ఎ¯ŒSఆర్ కిషోర్‌బాబు చెప్పారు. అదే గ్రామానికి చెందిన ఇంతేటి రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలి జ్యోతి, కాలి ప్రవీణ్, కాలి కిరణ్‌లపైనా కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై గ్రామ టీడీపీ అధ్యక్షుడు కసుకుర్తి రామకృష్ణ వివరణ ఇస్తూ.. ఈ విషయాలేవీ తనకు తెలియవన్నారు. తాను దళితపేట బస్ షెల్టర్ వద్దకు వెళ్లలేదని, దాడి ఘటనతో తనకు సంబంధం లేదని అన్నారు.
Advertisement
Advertisement