హైదరాబాద్: టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆదిభట్లలో శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు దేశ వైమానికరంగానికి తలమానికంగా మారనుందన్నారు. అపాచీ, హెలికాఫ్టర్ల ప్రధాన భాగాలను తయారు చేయడానికి బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ యూనిట్ను 13 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్తో పాటు అధికారులు పాల్గొన్నారు.
టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్కు శంకుస్థాపన
Published Sat, Jun 18 2016 1:33 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement