హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ప్లాంటులో తయారు చేసిన తొలి ’వర్టికల్ ఫిన్’ భాగాన్ని అమెరికాలోని బోయింగ్ విమానాల తయారీ కేంద్రానికి పంపించినట్లు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏ) వెల్లడించింది. దీన్ని అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న బోయింగ్ ప్లాంటుకు డెలివరీ చేస్తారు. అక్కడ బోయింగ్ 737 విమానానికి అమరుస్తారు.
నిట్టనిలువుగా ఉండే వర్టికల్ ఫిన్ భాగాన్ని విమానానికి స్థిరత్వాన్నిచ్చేలా ఎయిర్‌క్రాఫ్ట్ తోకపై ఏర్పాటు చేస్తారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, బోయింగ్ కలిసి టీబీఏను జాయింట్ వెంచర్ సంస్థగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన వర్టి కల్ ఫిన్ భాగాల తయారీ కోసం టీబీఏ గతేడాదే కొత్త లైన్‌ను ప్రారంభించింది. 14,000 చ.మీ. విస్తీర్ణంలోని టీబీఏ ప్లాంటులో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్టర్లకు కావాల్సిన ఏరో–స్ట్రక్చర్స్ మొదలైన వాటిని తయారు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...)
Comments
Please login to add a commentAdd a comment