టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే
విజయవాడ: తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పించింది. సుజనా చౌదరితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించారు.
మరో రాజ్యసభ స్థానాన్ని టీడీపీ మిత్రపక్షం బీజేపీకి కేటాయించింది. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఇక్కడి నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి టీడీపీకి మూడు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ సీటు దక్కనుంది.