టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం | tdp group politics in hindupur | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం

Published Sun, Feb 5 2017 12:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

tdp group politics in hindupur

హిందూపురం అర్బన్‌ : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త నాగరాజు, టీడీపీ కౌన్సిలర్‌ రోషన్‌ అలీలు శనివారం రాత్రి ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద పీఏ శేఖర్‌ ఎదుట వాగ్వాదాలు చేసుకుంటూ తోపులాడుకున్నారని సమాచారం. మున్సిపల్‌ నిధుల్లో తన వార్డుకు కావాలనే పనులు పెట్టలేదని రోషన్‌అలీ ఎమ్మెల్యే పీఏ శేఖర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పీఏ ఇద్దరినీ పిలిపించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఆగ్రవేశాలతో ఊగిపోయి ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు.

టీడీపీ కౌన్సిలర్‌ అయి ఉండి కౌన్సిల్‌ డీసెంట్‌ చెప్పారని రోషన్‌అలీపై నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరినొకరు తోసులాడుకోవడంతో అక్కడే ఉన్న పీఏ శేఖర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అమర్, ఇతర నాయకులు ఇద్దరికీ సర్దిచెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నింఽచారు. కాగా ఈవిషయం పట్టణంలో చర్చనీయంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement