రాజంపేట : రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఇటీవల పోలీసు, రెవెన్యూశాఖ పరంగా అధికారపార్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా లేకుంటే అవినీతి..అమ్ముడుపోయారనే లాంటి అపవాదును అంటగడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివిధశాఖలకు చెందిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ బహిరంగగానే ఆరోపణలు గుప్పించడంపై అధికారపార్టీ వర్గాల్లో కలకలంరేపుతోంది. అధికారపార్టీలో కొనసాగుతున్నవారే అధికారుల పనితీరుపై పచ్చనేతలు ధ్వజమెత్తుతుంటే అది నేరుగా చంద్రబాబు సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉందనే భావనతో కొందరు పార్టీనేతలు ఆవేదన చెందుతున్నారు. మా విధులు మమ్మల్ని చేయనివ్వండి. లేదంటే పనిచేయలేం..బదిలీ చేసేయ్యండి బాబు అంటూ పలువురు అధికారులు అధికార పార్టీ నేతల తీరుతో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
పోలీసువైఖరిపై మహిళనేత కస్సుబుస్సు..
నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో రెండురోజు క్రింద జరిగిన ఓ ఘర్షణ కేసుకు సంబంధించి పోలీసులు హత్యయత్నం కేసును నమోదు చేశారు. ఈవిషయంలో అధికారపార్టీ చెందిన జిల్లా మహిళనాయకురాలు రంగప్రవేశం చేశారు.. ఈ కేసు పెట్టడం అన్యాయమంటూ, తమ వర్గానికి చెందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదంటూ ఏకంగా ఉన్నతస్థాయి అధికారి నుంచి కింద వరకు ఉన్న పోలీసులు ఏకపక్షంగా వ్యవహారించారని, అమ్ముడుపోయారని మీడియా ఎదుట ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలు పై పోలీసులు అంసతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మహిళనేత రాత్రి వరకు పోలీసుస్టేషన్‌లోనే భీష్మించుకొని ఉండటం అధికారపార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నాయకురాలు అనుసరిస్తున్న తీరు బెదిరింపు«ధోరణిలా ఉందనే భావనకు పోలీసులు వచ్చేసినట్లు తెలిసింది.
ప్రభుత్వనేతలే మాపై నిందలేస్తుంటే ఏలా?
ప్రభుత్వం ఆదేశాలు, నిబంధనల మేరకు పనిచేస్తుంటే ..అధికారపార్టీకి చెందిన నేతలే అనవసరమైన నిందలేస్తుంటే ఏలా అనే భావన అధికారుల్లో నెలకొనింది. ప్రధానంగా పోలీసు, రెవిన్యూశాఖలకు అధికారపార్టీకి చెందిన నేతల నుంచి వత్తిడి రోజురోజుకు అధికంకావడం రాజంపేట డివిజన్‌లో అధికమవుతోంది. అనుకూలం..ప్రతికూలం అంశాలను పరిగణనలోకి తీసుకొని తమ పట్ల అధికారపార్టీ నేతలు ఇష్టానుసారగంగా వ్యవహారిస్తుంటే ఇక ప్రభుత్వం నడిచే బాటలో ఏ విధంగా నడుచుకోగలమని అధికారవర్గాలు వాపోతున్నారు. విడమంటే పాముకు కోపం, కరచమంటే కప్పకు కోపం అన్నట్లు చందనా రాజంపేట పోలీసు, రెవిన్యూ అధికారుల తలలుపట్టుకుంటున్నారు. కొందరైతే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి బదిలీకోసం వేయికన్నులతో ఎదురుచూస్తున్నారు.
బజారున పడిన పచ్చపార్టీ పరువు!
Published Sat, Apr 1 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
Advertisement
Advertisement