కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ శివారులో ఎల్లంపల్లి - హైదరాబాద్ పైపులైను నుంచి నీళ్ళు చోరీ చేసిన ఘటనలో టీడీపీ నాయకుల అరెస్ట్‌లను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు సోమవారం రాస్తారోకో నిర్వహించాయి.
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ శివారులో ఎల్లంపల్లి - హైదరాబాద్ పైపులైను నుంచి నీళ్ళు చోరీ చేసిన ఘటనలో టీడీపీ నాయకుల అరెస్ట్‌లను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు సోమవారం రాస్తారోకో నిర్వహించాయి. నీళ్ల చోరీ ఘటనలో తెలుగు యువత నాయకులు గణేశ్, సతీష్‌లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరి అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా టీడీపీ నాయకులు సుల్తానాబాద్‌లో రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ మండల అధ్యక్షుడు విద్యారమణారావు తాను నీరు చోసీ చేసినట్టు అంగీకరించినందున ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు యువత నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు.