ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోవాలి | teachers teach well | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోవాలి

Published Wed, Nov 23 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోవాలి

ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోవాలి



నూజివీడు : డివిజ న్‌లోని హైస్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు దారుణంగా ఉందని, మెరుగుపరచకుంటే ఉపాధ్యాయులు ఇబ్బంది పడాల్సి వస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ సుబ్బారెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ హైస్కూల్‌లో డివిజన్‌లోని హైస్కూల్‌ హెచ్‌ఎంలు, ఎంఈవోలు, సీఆర్పీల సమావేశం బుధవారం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ సమ్మెటివ్‌ అసెస్స్‌మెంట్‌ –1లో విద్యార్థులకు వచ్చిన మార్కులు చూస్తుంటే చాలా దారుణంగా పరిస్థితి ఉందన్నారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పిల్లల వివరాలు, ఆధార్‌ నంబర్లు త్వరితగతిన ఆ న్‌లై న్‌లో నమోదు చేసి, నామినల్‌ రోల్స్‌ను సరిచేసి సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. చెప్పారు. డైస్‌ వివరాలను సీఎస్‌ఈ వెబ్‌సైట్‌ నుంచి డౌ న్‌లో న చేసుకుని ఏమైనా తేడాలంటే వాటిని సరిచేసి ఆ న్‌లై న్‌ చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో వారానికి తప్పనిసరిగా మూడు కోడిగుడ్లు ఇవ్వాలని కోరారు. హాజరు వివరాలు, ఎంతమంది భోజనం చేశారనే వివరాలను యాప్‌ ద్వారా ప్రతిరోజు పంపాలన్నారు. బియ్యం ఇండెంట్‌లను ఈ పోస్‌ విధానం ద్వారా ఇవ్వాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి యూనిట్‌ 1, 2, క్వార్టర్లీ పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలను వెంటనే ఆ న్‌లై న్‌లో ఉంచాలని, వీటిని ఆధారంగానే ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయని వివరించారు. ఈనెల 30, వచ్చేనెల 1వ తేదీ రెండురోజుల పాటు గుడివాడలో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్‌స ఎగ్జిబిషన్‌లో ప్రతి పాఠశాల నుంచి పాల్గొనాలని పేర్కొన్నారు. అనంతరం డివిజన్‌లోని హైస్కూల్‌ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నూజివీడు డీవైఈవో ఎన్‌వీ రవిసాగర్, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎగ్జామ్స్‌ లింగేశ్వరరావు, కామన్‌బోర్డు సెక్రటరి రామకృష్ణ, సర్వశిక్ష అభియాన్‌ ఎంఐఎస్‌ ఆర్‌.హైమేశ్వరరావు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement