భద్రాద్రి బయల్దేరిన సీఎం కేసీఆర్ | telangana chief minister kcr engagement in bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రి బయల్దేరిన సీఎం కేసీఆర్

Published Fri, Apr 15 2016 9:35 AM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM

telangana chief minister kcr engagement in bhadrachalam

హైదరాబాద్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయల్దేరారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కేసీఆర్తో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా భద్రాచలం బయల్దేరారు.

షెడ్యూల్‌ ఇలా...
ఉదయం 9.30గం.లకు మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయలుదేరారు.
ఉదయం 10.30గం.లకు భద్రాచలంలోని జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుంది. అక్కడ నుంచి ఐటీడీఏ సమీపంలోని గహ నిర్మాణ శాఖ గెస్టుహౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.
ఉదయం 11గం.లకు సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి వస్తారు. సుమారు 20 నిమిషాలు పాటు ఆలయంలో పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11.30గం.లకు ఆలయం నుంచి కల్యాణ మండపానికి  చేరుకుంటారు.

l11.30 గం.ల నుంచి 12.30గం.ల వరకు సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అక్కడ నుంచి మళ్లీ రామాలయాన్ని 12.40గం.లకు దర్శించుకుంటారు.
తరువాత హౌసింగ్‌ గెస్ట్‌హౌస్‌కు చేరకుంటారు. మధ్యాహ్నం 12.50గం.ల నుంచి 1.15గం.ల వరకూ విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.15గం.ల నుంచి 1.45 గం.ల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. ఆ తరువాత భద్రాచలం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి వెళతారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement