చదువుకున్న బడికి శంకుస్థాపన చేసిన కేసీఆర్ | Telangana CM KCR lays foundation stone for School building at Dubbaka | Sakshi
Sakshi News home page

చదువుకున్న బడికి శంకుస్థాపన చేసిన కేసీఆర్

Published Mon, Jan 11 2016 12:50 PM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM

చదువుకున్న బడికి శంకుస్థాపన చేసిన కేసీఆర్ - Sakshi

చదువుకున్న బడికి శంకుస్థాపన చేసిన కేసీఆర్

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయప పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రవెల్లిలో  దాదాపు 29 కోట్లతో కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎర్రవల్లిలో దాదాపు 42.5 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్‌కు శంకుస్థాపన చేశారు. కాగా మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయింది. అరకొర వసతుల మధ్య విద్యనభ్యసించిన నాటి విద్యార్థి కేసీఆర్.. నేడు ముఖ్యమంత్రి హోదాలో పాఠశాల నూతన భవన శంకుస్థాపన చేశారు.

తాను అష్టకష్టాలు పడి విద్యను పూర్తిచేశానని, తనకొచ్చిన బాధలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు రావొద్దన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.4.67 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే.  అనంతరం దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో బాలాజీ ఫంక్షన్ హాలులో సీఎం సమీక్ష నిర్వహించారు. కాగా మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వెంకటేశ్వర ఆలయంలో తన బాల్యమిత్రులతో సీఎం గడపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement