వరంగల్ : వరంగల్ జిల్లా జరుగుతున్న మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 4 వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రావాణ శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి వెల్లడించారు. భక్తుల తిరుగు ప్రయాణం కోసం మరో 1500 బస్సులు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని బట్టి ఆర్టీసీ సేవలందిస్తుందన్నారు. మేడారం జాతరను వచ్చే ఏడాది నుంచి జాతీయ పండుగగా నిర్వహిస్తామని రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు.
రేపటి రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయా శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అంతకుముందు ఈ మంత్రుల ముగ్గురు మేడారంలోని సమ్మక, సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.