ప్రకాశం: అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా తిరిగి వస్తారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన 150మంది తెలుగువారు అక్కడే చిక్కుకుపోయారు.
ప్రతికూల పరిస్థితుల కారణంగా వారి యాత్రకు ఆర్మీ విఘాతం కలిగించింది. దీంతో అన్నపానీయాలు సైతం లేకుండా వారు అక్కడే యాత్రలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారితో తాను ఫోన్లో మాట్లాడినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని తాను సెంట్రల్ హోం సెక్రటరీ గోపాల్ రెడ్డికి చెప్పానని ఆయన వారిని సురక్షితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
‘తెలుగువారు క్షేమంగా తిరిగొస్తారు’
Published Sun, Jul 10 2016 12:52 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement