చక్రాయపేట: పాతనోట్ల రద్దు ప్రభావం ఆలయాలపై కూడా పడింది. రాష్ట్రంలో ప్రసిద్ధి గ్రాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 5న కల్యాణకట్ట నిర్వహణకు టెండర్లు పిలిచారు. అయితే అనివార్య కారణాల వల్ల వాటిని రద్దు చేశారు. అయితే మళ్లీ తాజాగా గురువారం టెండర్లు పిలిచారు. అయితే డిపాజిట్ రూ. 20 లక్షలు కట్టాల్సి ఉండడంతో టెండర్ దాఖలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని అధికారులు చెబుతున్నారు.