కల్యాణకట్ట వద్ద శిశువు లభ్యం
తిరుమల: తిరుమల కల్యాణ కట్ట వద్ద నెలన్నర మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువు ఏడుస్తూ ఉండటం గమనించిన స్థానికులు ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును తీసుకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ పుటేజీల ద్వారా ఆధారాలు దొరుకుతాయాయోనని పోలీసులు పరిశీలిస్తున్నారు.