బండరాళ్ల మధ్య యువకుడి మృతదేహం | The body of a young man among the boulders | Sakshi
Sakshi News home page

బండరాళ్ల మధ్య యువకుడి మృతదేహం

Published Tue, Jul 11 2017 11:18 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

The body of a young man among the boulders

పెనుకొండ : వెంకటరెడ్డిపల్లి వద్ద ఓవర్‌బ్రిడ్జి సమీపాన 44వ నంబరు జాతీయ రహదారి పక్కన గల రైల్వే ట్రాక్‌ పైభాగంలో మంగళవారం బండరాళ్ల మధ్య రక్తపుమడుగులో పడి ఉన్న ఓ యువకుడి (25) మృతదేహాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ జనార్ధన్‌, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపినా ఎటువంటి ఆనవాళ్లూ లభించలేదు. బండరాళ్లతో కొట్టి చంపినట్టు తెలుస్తోంది. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండొచ్చని సీఐ తెలిపారు. మృతుడు ఆరెంజ్‌ రంగు చెడ్డీ, ఎర్రచొక్కా ధరించాడు. సమీపంలోనే ఓ చున్నీ పడి ఉంది. మరికొంత దూరంలో బ్యాగులు లభించాయి. యువకుడి చేతిపై ‘శివ’ అనే పేరు ఉందని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement