నగర ‘దారి’ద్య్రం | The city roads are copied to hell | Sakshi
Sakshi News home page

నగర ‘దారి’ద్య్రం

Published Wed, Jul 5 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

నగర ‘దారి’ద్య్రం

నగర ‘దారి’ద్య్రం

నగర రోడ్లు నరకానికి నకలు
మోకాలులోతు గుంతలు
రోడ్లపైనే వాహనాల పార్కింగ్‌
♦ పట్టించుకోని ట్రాఫిక్‌ అధికారులు

కమాన్‌చౌరస్తా: దేశంలోని వంద స్మార్ట్‌ నగరాలలో ఆరోస్థానంలో నిలిచిన కరీంనగర్‌లో గుంతల రోడ్లు..ట్రాఫిక్‌జామ్‌. స్మార్ట్‌నగరంగా చోటు దక్కించుకున్న కనీస వసతులు మృగ్యంగా మారాయి. మోకాలులోతు గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణిస్తుంటే నడుమునొప్పి వచ్చుడు ఖాయం. పాదచారులు నడవలేనంతగా రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌. వర్షం పడితే నీళ్లు వెళ్లలేని విధంగా డ్రెయినేజీలు. ఇదీ మొత్తంగా నగర పరిస్థితి.

అడుగడుగునా గుంతలే!
కమాన్‌చౌరస్తా నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీకి వెళ్లే దారిలో అడుగడుగునా గుంతలే దర్శనమిస్తాయి. హౌసింగ్‌బోర్డు, పాతబజార్‌ ప్రాంతాల నుంచి ఎక్కువశాతం విద్యార్థిని, విద్యార్థులు, విద్యాసంస్థలకు వెళ్లే వారు కమాన్‌చౌరస్తాకు వచ్చి బస్సులు, ఆటోలు ఎక్కాల్సిందే. అయితే మోకాలు లోతు గుంతలు పడడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

ట్రా‘ఫికర్‌’’
ప్రతీ రోజు ఉదయం కమాన్‌చౌరస్తాలోని టిఫిన్‌సెంటర్ల వద్దకు వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక సాయంత్రం వైన్స్, మిర్చీబజ్జి బండ్లు, కట్లీస్‌ బండ్ల వద్ద గుమిగూడే జనంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. ఇదే ప్రాంతంలో బాలికల వసతిగృహాలు ఉన్నాయి. వివిధ అవసరాలకు సాయంత్రం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చే ఖాతాదారులు సైతం రోడ్డుపైనే వాహనాలు నడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై దృష్టిపెడితేనే జనం ఇబ్బందులు తీరేలా ఉన్నాయి.  

గుంతలు పూడ్చాలి
కమాన్‌ నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీకి వెళ్లే రోడ్డుపై పెద్ద గుంతలుంటాయి. టిఫిన్‌సెంటర్లు, బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలుపుతుండడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రమైతే ఈ రోడ్డుపై మహిళలు వచ్చేందుకు జంకుతున్నారు.  
– మధుకర్, ఉద్యోగి

కొత్త రోడ్డు వేయాలి
కమాన్‌చౌరస్తా నుంచి హౌసింగ్‌బోర్డు చౌరస్తా వరకు కొత్తగా రోడ్డు వేయాలి. ఎక్కువ సంఖ్యలో కళాశాలలు ఇటే ఉండడంతో విద్యార్థులు, ఉద్యోగులు వందల సంఖ్యలో వెళ్తుంటారు. కొత్త రోడ్డు వేస్తే కొంత వరకు సమస్య తీరినట్లే. ఈమేరకు అధికారులు స్పందించాలి.  
–సాయి, ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement