City roads
-
నగర రోడ్ల కోసం టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: నగర రహదారుల కోసం హైదరాబాద్ రోడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ప్రస్తుతం నగర రోడ్లను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు సూచించడంతో పాటు, రోడ్ల మరమ్మతులు, నూతన ప్రాజెక్టులను ఈ టాస్క్ఫొర్స్ సమన్వయం చేస్తుందన్నారు. నగర రోడ్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ జలమండలిలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ సిబ్బంది కొరత తీర్చడంతోపాటు, నిధులకు సంబంధించి ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం, బ్యాంకుల నుంచి రుణాల సేకరణ వంటి అన్ని ఏర్పాట్లు నగర రోడ్ల కోసం చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సుమారు రూ.20 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రహదారుల కోసం ఖర్చు చేయనున్న నేపథ్యంలో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లో పురపాలక శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో రైల్, టీఎస్ఐఐసీ ఎండీలు, నగర చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ), జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల సీఈలు సభ్యులుగా ఉంటారన్నారు. నగరంలో భారీ వర్షాలకు పాడయిన రోడ్లను యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రూ.77 కోట్లతో మరమ్మతులు ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ వర్షాకాలంలో నీళ్లు నిలిచి, ట్రాఫిక్ జామ్‌కు కారణమైన సుమారు 350 రోడ్ పాయింట్లను అధికారులు గుర్తించారని, ఈ ప్రాంతాల్లో వైట్ టాపింగ్ రోడ్లు వేసేందుకు రూ.130 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలన్నారు. డివిజన్‌కు ఒక ఇంజనీర్.. దీంతో పాటు నగరంలోని రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చేపట్టిన పలు ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టనున్న పనుల తాలూకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని, వాటికి వెంటనే టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సార్డీపీ ద్వారా వచ్చే ఏడాదిలోగా సుమారు రూ.వెయ్యి కోట్ల పనులు పూర్తవుతాయని, వీటితో ప్రస్తుతం రద్దీగా ఉన్న పదుల సంఖ్యలోని కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరమవుతాయని చెప్పారు. రోడ్ల నిర్వహణకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి వినూత్న విధానాలు పాటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా సుమారు 50 మంది ఇంజనీర్లు రోడ్ల నిర్వహణను పర్యవేక్షించేవారని, ఇకపై డివిజన్‌కు ఒకరు చొప్పున 150 మంది ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తారన్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా 150 మంది ప్రత్యేకంగా రోడ్లపైనే పనిచేస్తారని మంత్రి చెప్పారు. -
నగర ‘దారి’ద్య్రం
♦ నగర రోడ్లు నరకానికి నకలు ♦ మోకాలులోతు గుంతలు ♦ రోడ్లపైనే వాహనాల పార్కింగ్ ♦ పట్టించుకోని ట్రాఫిక్ అధికారులు కమాన్‌చౌరస్తా: దేశంలోని వంద స్మార్ట్ నగరాలలో ఆరోస్థానంలో నిలిచిన కరీంనగర్లో గుంతల రోడ్లు..ట్రాఫిక్‌జామ్. స్మార్ట్నగరంగా చోటు దక్కించుకున్న కనీస వసతులు మృగ్యంగా మారాయి. మోకాలులోతు గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణిస్తుంటే నడుమునొప్పి వచ్చుడు ఖాయం. పాదచారులు నడవలేనంతగా రోడ్డుపైనే వాహనాల పార్కింగ్. వర్షం పడితే నీళ్లు వెళ్లలేని విధంగా డ్రెయినేజీలు. ఇదీ మొత్తంగా నగర పరిస్థితి. అడుగడుగునా గుంతలే! కమాన్‌చౌరస్తా నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీకి వెళ్లే దారిలో అడుగడుగునా గుంతలే దర్శనమిస్తాయి. హౌసింగ్‌బోర్డు, పాతబజార్ ప్రాంతాల నుంచి ఎక్కువశాతం విద్యార్థిని, విద్యార్థులు, విద్యాసంస్థలకు వెళ్లే వారు కమాన్చౌరస్తాకు వచ్చి బస్సులు, ఆటోలు ఎక్కాల్సిందే. అయితే మోకాలు లోతు గుంతలు పడడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ట్రా‘ఫికర్’’ ప్రతీ రోజు ఉదయం కమాన్‌చౌరస్తాలోని టిఫిన్‌సెంటర్ల వద్దకు వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక సాయంత్రం వైన్స్, మిర్చీబజ్జి బండ్లు, కట్లీస్ బండ్ల వద్ద గుమిగూడే జనంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఇదే ప్రాంతంలో బాలికల వసతిగృహాలు ఉన్నాయి. వివిధ అవసరాలకు సాయంత్రం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చే ఖాతాదారులు సైతం రోడ్డుపైనే వాహనాలు నడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై దృష్టిపెడితేనే జనం ఇబ్బందులు తీరేలా ఉన్నాయి. గుంతలు పూడ్చాలి కమాన్ నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీకి వెళ్లే రోడ్డుపై పెద్ద గుంతలుంటాయి. టిఫిన్‌సెంటర్లు, బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలుపుతుండడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రమైతే ఈ రోడ్డుపై మహిళలు వచ్చేందుకు జంకుతున్నారు. – మధుకర్, ఉద్యోగి కొత్త రోడ్డు వేయాలి కమాన్‌చౌరస్తా నుంచి హౌసింగ్‌బోర్డు చౌరస్తా వరకు కొత్తగా రోడ్డు వేయాలి. ఎక్కువ సంఖ్యలో కళాశాలలు ఇటే ఉండడంతో విద్యార్థులు, ఉద్యోగులు వందల సంఖ్యలో వెళ్తుంటారు. కొత్త రోడ్డు వేస్తే కొంత వరకు సమస్య తీరినట్లే. ఈమేరకు అధికారులు స్పందించాలి. –సాయి, ఉద్యోగి -
నీట మునిగిన మూసాపేట..!
-
తవ్వారు.. వదిలేశారు!
ముందుచూపు లేని అధికారులు.. మంజూరైన నిధులు రూ.6 కోట్లు.. నాలుగు నెలల కిందటే పనులు ప్రారంభం తవ్విన రోడ్లు 1.2 కిలో మీటర్లు.. సీసీ వేసిన రోడ్డు 600 మీటర్లు మాత్రమే.. వికారాబాద్: దుమ్ము.. దూళితో పట్టణ ప్రజలు రోజూ అవస్థలు పడుతూ.. శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో పట్టణ ప్రజలు భాదపడుతున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ‘ఎవరికేమైతే మాకేంటి’ అనే ధోరణిలో పట్టణ వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నారు. పట్టణలో పూర్తిస్థాయిలో రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ అధికారుల ఆలోచనబాగున్నప్పటికీ.. అమలులో ముందుచూపు లేకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఒకింత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చే స్తున్నారు. పట్టణ రోడ్డు వెడల్పుపై న్యాయస్థానాల్లో కేసులున్నప్పుడు కాంట్రాక్టర్లతో రోడ్లను ఎలా తవ్విస్తారని అధికారులపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పట్టణంలో ప్రధాన దారులను అడ్డదిడ్డంగా తవ్వి రెండు నెలలకు పైగా అయింది. ఇటు అధికారుల తీరు, అటు వ్యాపారుల వైఖరితో ఇబ్బందులకు గురవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే.. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 129,130,131లో వికారాబాద్ ఆర్అండ్బీ డివిజన్ పరిధిలో వందల సంఖ్యలో రోడ్లు మంజూరయ్యాయి. పట్టణంలో రోడ్లన్నీ అధికలోడ్‌తో లారీలు వెళ్లడంతో ధ్వంసమవుతున్నాయి. గమనించిన ఆర్అండ్బీ అధికారులు దీర్ఘాకాలంపాటు రోడ్డు ధ్వంసం కాకుండా ఉండేందుకు సీసీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంట్లోభాగంగానే వికారాబాద్ పట్టణం లో 1.5 కిలోమీటరు మేరకు ప్రధాన రహదారులను సీసీ రోడ్డుగా మార్చేందుకు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట పట్టణంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. ఆలంపల్లి నుంచి ఎంఆర్పీ చౌరస్తా వరకు సీసీ పనులు పూర్తయ్యాయి. కానీ మహాశక్తి టాకీస్ నుంచి కెనరా బ్యాంకు వరకు సీసీ పనులు ఆగిపోయాయి. అడ్డుకున్న వ్యాపారులు.. పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకల దృష్ట్యా రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆర్అండ్బీ అధికారులు 8 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో వ్యాపారులకు సంబంధించిన కొన్ని దుకాణాలకు నష్టం వాటిల్లింది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. గతంలో చేసిన రోడ్డు వెడల్పు సంబంధించిన పనులు పూర్తిచేసిన తరువాతే ప్రస్తుతం సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు పొంది అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్క డే ఆగిపోయాయి. నాలుగు నెలల కిందట తవ్వేసిన రోడ్ల తో పట్టణంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేస్తే.. ఆర్అండ్బీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో వేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయించి పనులు పూర్తి చేయొచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బై'కింగ్స్'
-
సిటీ రోడ్లపై సీఎం సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: ‘ఢిల్లీలో రోడ్లు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడెందుకింత అధ్వానంగా దెబ్బతింటున్నాయి? ఒక్క వానకే ఛిద్రమవుతున్నాయెందుకు? సమస్య పరిష్కారానికి మీరేం చేస్తున్నారు?’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారుల తీరు పై మండిపడ్డారు. నగరంలో ర హదారులు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ తదితర విభాగాల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. యంత్రాంగం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నిధుల సమస్య లేదు. ఎన్ని కావాలో చెప్పండి. రోడ్లు మాత్రం బాగుండాలి. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, నిర్వహణ పనులు జరగాలి’ అన్నారు. సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో వారంలో తనకు నివేదికనివ్వాలని ఆదేశించారు. వచ్చేవారం మరోమారు సమీక్షిస్తానన్నారు. ఆర్అండ్బీ, జలమండలి తదితర విభాగాల సమన్వయంతో తగిన ప్రణాళికతో జీహెచ్ఎంసీ ముందుకు రావాలన్నారు. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా, నగర జనాభాకు తగిన విధంగా, అన్ని కాలాల్లో మన్నికగా ఉండేలా పనులు చేపట్టాల న్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి సహించేది లేదన్నారు. వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తగిన కేంబర్తో, నాణ్యమైన సామగ్రితో రహదారుల పనులు చేయాలని సూచిం చారు. సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, ముఖేశ్‌గౌడ్, డి.నాగేందర్, చీఫ్ సెక్రటరీ మహంతి, మున్సిపల్ పరిపాలన, పట్టాణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, జలమండలి ఎండీ శ్యామలరావు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేంచంద్రారెడ్డి, ఆయా విభాగాల ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలు.. నగర రోడ్ల ప్రస్తుత దుస్థితికి తగిన ప్రణాళిక లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటం, నిబద్ధతలేమి కారణాలని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చేవారానికల్లా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, దీనికి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జోషికి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సీజన్లో నిరంతరాయంగా.. ఎక్కువ వర్షాలు కురియడం వ ల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. మున్నెన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిశాయని కృష్ణబాబు తెలిపారు. దీంతో నీటి నిల్వలతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 512 మి.మీ.ల వర్షపాతం నమోదైందని, సాధారణం కంటే ఇది 26.1 శాతం ఎక్కువన్నారు. జీహెచ్ఎంసీలో సాధారణ వర్షపాతం 406 మి.మీలని తెలిపారు. నీటినిల్వ ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. కేంబర్ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో మిల్లింగ్లతోపాటు బీటీ రోడ్లకు రీకార్పెటింగ్ పనులు చేస్తామని చెప్పారు. నీటి లీకేజీలు, మురుగునీటి ప్రవాహం, వివిధ విభాగాల అవసరార్థం రోడ్డు కటింగ్ల వల్ల కూడా రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయన్నారు. ప్రస్తుతం మరమ్మతు పనుల్ని కొనసాగిస్తామని, శాశ్వత రీకార్పెటింగ్ పనుల్ని మాత్రం వర్షాకాలం ముగిసిన వెంటనే చేపడతామన్నారు. ఈ సీజన్లో 2739 ప్రాంతాల్లో 61.35 కి.మీ.ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 39.54 కి.మీ.ల మేర మరమ్మతులు చేశామని, 15310 గుంతలకు 13501 పూడ్చామని ఆయన వివరించారు.