ఆధునిక పోకడలతో విలువలు కనుమరుగు
-
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
-
ముగిసిన పద్యనాటక సప్తాహం
-
ఆకట్టుకున్నపాదుకాపట్టాభిషేకం నాటకం
హన్మకొండ కల్చరల్ : శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన పెనుమార్పులు, ఆధునిక పోకడలతో మానవ విలువలు కనుమరుగవుతున్నాయని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్లవేణుమాధవ్ కళాప్రాంగణంలో పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి కొనసాగుతున్న రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం గురువారం ముగిసింది. చివరి రోజు జరిగిన కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పందిళ్ల శేఖర్‌బాబు పేరిట రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. పౌరాణిక కళాకారులకు పందిళ్ల శేఖర్‌బాబు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. నాటకాలు సందేశాత్మకంగా ఉంటాయని.. సమాజానికి ఉపయోగకరమైనవని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్.. పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పురస్కారాన్ని ప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నాటక రచయిత తడకమల్ల రాంచంద్రరావుకు అందజేశారు. అలాగే డాక్టర్ నిభా నుపూడి సుబ్బరాజు, జిల్లాకు చెందిన ప్రముఖ మైమ్ కళాకారుడు కళాధర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, వనం లక్షీ్మకాంతారావు, గిరిజామనోహర్‌బాబు, శ్రీరామోజు సుందరమూర్తి, గుడిమల్ల రవికుమార్, నిర్వాహక సలహా మండలి సభ్యుడు పందిళ్ల అశోక్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బూరవిద్యాసాగర్‌గౌడ్, ఆకుల సదానందం, తిరుమలయ్య, శ్రీధరస్వామి, రవీందర్, సదానందచారి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.