-పావగడ, పెనుకొండ ప్రధాన రహదారిపై 2 గంటలు ధర్నా
రొద్దం (అనంతపురం)
పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తలిస్తే తాము ఊరుకోమని పలువురు రైతులు ఇసుక రవాణాపై అన్నెర్ర చేశారు.కర్నాటక,ఇతర ప్రాంతాలకు భారీ తరులుతున్న అక్రమ ఇసుక రవాణ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని పెద్దాంజనేయస్వామి దేవాలయం వద్ద పావగడ-పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ఆందోళన జరగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సునీత్‌కుమార్ రోడ్డుపై ధర్నా చేయడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని రైతులు వేంటనే రోడ్డుపై విరమించాలని కోరారు. ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నయని చెప్పినప్పుడు స్పందించరా అంటూ ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. రైతులు వీరాంజినేయులు,లక్ష్మినారాయణరెడ్డి,సనావుల్లా,సీపీఐ నాయకులు బాబా,సీపీఎం నాయకులు ముత్యాలప్ప మాట్లాడుతూ ఇసుక రవాణా దారులపై చర్యలు తీసుకుంటనే ధర్నా విరమిస్తామని బీస్మించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.ధర్నా చేస్తున్న రైతులను ఓక్రమంలో బలవంతగాంగా తరలించడానికి పోలీసులు ప్రయత్నించారు. డీఎస్పీ సుబ్బారావు,సీఐ వెంకటేశ్వర్లు రొద్దంకు చేరుకుని ఇక్కడ జరిగిన విషయాలపై ఎస్‌ఐతో ఆరాతీశారు.