నాన్న కోసం ఆగిన గుండె | The son suffered with the death of his father passes away | Sakshi
Sakshi News home page

నాన్న కోసం ఆగిన గుండె

Published Tue, Jan 10 2017 1:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

నాన్న కోసం ఆగిన గుండె

నాన్న కోసం ఆగిన గుండె

తండ్రి మృతితో తల్లడిల్లిన కుమారుడు
గంటల వ్యవధిలోనే కన్నుమూత


శ్రీకాళహస్తి రూరల్‌: చిన్నతనం నుంచి చేయిపట్టి నడిపించిన ఆ చేతులు మట్టిలో కలసిపోతాయనే భావనను జీర్ణించుకోలేని ఓ కుమారుడి గుండె పగిలింది. తండ్రి చనిపోయిన కొద్దిసేపటికే తనయుడూ కన్నుమూసిన ఘటన సోమవారం శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరు దళితవాడలో చోటుచేసుకుంది. తొట్టంబేడు  గంగయ్య(67) కమ్మకొత్తూరు దళితకాలనీలో కుమారుడు సుబ్బరాయు లు(45)తో కలిసి జీవించేవాడు. కుమారుడు ప్రతిరోజు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గంగయ్యకు వృద్ధాప్య సమస్యల వల్ల కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించింది. పట్టణంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు.

ఆరోగ్యం క్షీణించడటంతో ఆదివారం రాత్రి గంగయ్య మృతి చెందాడు. తండ్రి మరణం జీర్ణించుకోలేక కుమారుడు కుమిలిపోయాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించటానికి స్థానికులు ఏర్పాట్లు చేస్తుండగా సుబ్బరాయులుకు హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే తండ్రి మృతదేహం వద్దనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. తండ్రీతనయుల మృతదేహాలను ఒకే దగ్గర ఉంచి స్థానికులు.. బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. సుబ్బరాయులుకు భార్య, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement