విద్యార్థిని కబళించిన విద్యుత్‌ | The student smeared electricity | Sakshi
Sakshi News home page

విద్యార్థిని కబళించిన విద్యుత్‌

Published Tue, Aug 8 2017 10:55 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

The student smeared electricity

కనగానపల్లి: విద్యుత్‌ మోటర్‌ తీగ ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కొళాయి నీటిని మోటార్‌ ద్వారా పట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తూంచర్లకు చెందిన బిల్లే పెద్దన్న, నారమ్మ దంపతుల రెండో కుమారుడు బిల్లే సంతోష్‌ (12) ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పశువులపాక వద్ద తొట్టెకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో పంచాయతీ కొళాయి నుంచి నీరు తక్కువగా వస్తుండటంతో అక్కడే ఉన్న విద్యుత్‌ మోటర్‌ (జెట్‌ మోటర్‌) వేశాడు.

మోటర్‌ ఆన్‌ చేయగానే పైపు ఊడిపోయింది. దానిని తిరిగి అమర్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మోటార్‌ విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో విద్యుదాఘాతంతో విలవిలలాడి అక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత అటువైపు వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement