ఉపాధ్యాయుడి దాష్టీకంతో ఓ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొక్కిలిగడ్డ నథానియేల్ ఈనెల 24వ తేదీన తరగతులకు హాజరుకాలేదు. బుధవారం అతడు బడికి రాగా శ్రీనివాసరావు అనే టీచర్ అతడిని ప్రశ్నించాడు. స్కూలుకు రానందుకు శిక్షగా అతడితో 100 గుంజీలు తీయించాడు. అంతటితో ఆగకుండా ప్లాస్టిక్ పైపుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి స్పృహతప్పి పడిపోయాడు. పాఠశాల నిర్వాహకులు అతడిని చల్ల పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.