న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం | The tragedy of the New Year celebrations | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం

Published Sun, Jan 1 2017 3:16 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం - Sakshi

న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం

పుంగనూరు : ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉన్న వేళ పుంగనూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం సర్కిల్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎస్‌ఐ హరిప్రసాద్‌ కథనం మేరకు.. సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు కలిగిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కోర్టు రూటులో వెళుతుండగా పాల కంటైనర్‌ అతివేగంగా వచ్చి ఢీకొంది. ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎస్‌ఐ హరిప్రసాద్‌ అక్కడికి చేరుకుని క్షతగాత్రుడినిస్థానిక ఫ్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రుడి వివరాలు తెలియరాలేదు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement