కొనసాగుతున్న నీటి విడుదల
ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది
బాల్కొండ: ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4200 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 900 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1074.60(38.77టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. రెండు టర్బయిన్ల ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.