Kakatiya
-
కాకతీయ జూపార్క్‌కు కరీనా ,శంకర్ ఆగయా..!
న్యూశాయంపేట : వరంగల్ నగరంలోని కాకతీయ జూపార్క్‌కు ఆడపులి కరీనా (15), మగ పులి శంకర్ (10) వచ్చేశాయి. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దపులుల దర్శన భాగ్యం త్వరలో కలగనుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా రెండు పెద్ద పులులతోపాటు అడవిదున్నల ఎన్క్లోజర్లు, రెండు జింకల ఎన్క్లోజర్లను ప్రారంభించనున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.ఐదేళ్ల కిందటే రావాల్సి ఉండే..కాకతీయ జూపార్క్‌లో పెద్ద పులులు, అడవిదున్నల కోసం ఐదేళ్ల క్రితమే ఎన్‌క్లోజర్ పనులు ప్రారంభించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడం.. బడ్జెట్ లేదనే నెపంతో పనులను మధ్యలోనే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడంతో జూపార్క్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్క్లోజర్ల పనులు పూర్తి చేసి రెండు పెద్ద పులులు, ఇతర జంతువులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.హగ్ డీర్.. బార్కిన్ డీర్ వైజాగ్ నుంచి రాక..కాకతీయ జూపార్క్‌కు రెండు జింక (హగ్ డీర్, బార్కిన్ డీర్)లను ఆంధ్రప్రదేశ్‌నుంచి తీసుకొచ్చినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నట్లు చెప్పారు. సెంట్రల్ జూపార్క్ అథారిటీ అనుమతితో ఈ జంతువులను జూపార్క్‌కు తీసుకొస్తున్నట్లు వివరించారు. వాటి కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్ల ఏర్పాటు చేశామన్నారు.సిద్ధసముద్రంలో పూడిక తీస్తే మేలు..జూపార్క్.. సిద్ధ సముద్రం చెరువు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండల మధ్య 47.64 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో వివిధ జంతువుల ఎన్క్లోజర్లకు పోను సిద్దసముద్రం చెరువు కొంతమేర ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెరువులో పూడిక తీసి బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని పార్క్‌ను సందిర్శించిన సందర్భంగా తెలిపారు. ఆ తరువాత పట్టించుకోలేదు. కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడం, జూపార్క్‌కు ప్రతేక నిధులు కేటాయించి సిద్ధసముద్రంలో పూడిక తీసి బోటింగ్ సదుపాయం కల్పించాలని పర్యాటకులు, నగరవాసులు కోరుతున్నారు.ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి..కాకతీయ జూపార్క్‌కు రెండు పెద్ద పులులు వచ్చాయి. రెండు జింకలు వైజాగ్ నుంచి ఇటీవల తీసుకొచ్చాం. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేదాక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఆ తరువాత సందర్శకులకు అనుమతిస్తాం.– భీమానాయక్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి, భద్రాద్రి సర్కిల్ -
ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి!
ధైర్యసాహసాలు అనగానే ఇంకో ఆలోచన లేకుండా రాణీ రుద్రమ పేరే గుర్తొస్తుంది! అలాంటి ధీశాలి బస్తర్ ప్రాంత చరిత్రలోనూ కనిపిస్తుంది! ఆమె పేరే చమేలీదేవి! ఛత్తీస్‌గఢ్ సర్కారు ఇటీవలే ఆమె విగ్రహాన్ని చిత్రకూట్ జలపాతం దగ్గర ప్రతిష్ఠించింది. ఆ కథతో కాకతీయులకు, కాకతీయులతో మనకు చారిత్రక సంబంధం ఉంది కాబట్టి ఒకసారి బస్తర్ దాకా వెళ్లొద్దాం..తెలుగు నేలను పాలించిన రాజవంశాల్లో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాణి రుద్రమ పురుషాధిక్యతను ఎదుర్కొంటూ మంచి ఏలికగా పేరు తెచ్చుకుంది. ఆమె తర్వాత పాలనా పగ్గాలు ప్రతాపరుద్రుడి చేతికి వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ సుల్తానులు, మహారాష్ట్ర దేవగిరి రాజుల దాడులు పెరిగాయి. ముందు జాగ్రత్తగా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పనిని తన తమ్ముడైన అన్నమదేవుడికి అప్పగించాడు ప్రతాపరుద్రుడు. ఆ బాధ్యతలో భాగంగా గోదావరి నది దాటి దండకారణ్యంలో కొత్త రాజ్యస్థాపనకు బయల్దేరాడు అన్నమదేవుడు. ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ క్రీ.శ. 1323 కల్లా ఇంద్రావతి నదీ సమీపంలోని బర్సూర్ ప్రాంతానికి చేరుకున్నాడు.పరిచయం..ఆ ఇంద్రావతి నదీ తీర ప్రాంతాన్ని నాగవంశీయుడైన హరి చంద్రదేవ్ పాలిస్తున్నాడు. అతనికి చమేలీదేవి అనే కూతురు ఉంది. గొప్ప అందగత్తె. కళలతో పాటు రాజకీయ, రణతంత్రాలలో శిక్షణ పొందింది. తండ్రికి పాలనా వ్యవహరాల్లో సాయమందించేది. ఇంద్రావతి నదీ తీరాన్ని గెలవాలని నిర్ణయించుకున్న అన్నమదేవుడు దండకారణ్యాన్ని ఏలుతున్న హరి చంద్రదేవ్‌కు రాయబారం పంపాడు. యువరాణి చమేలీదేవిని తనకిచ్చి వివాహం జరిపించాలని, ఆ ఒప్పందానికి సమ్మతం తెలిపితే హరి చంద్రదేవ్‌ను రాజుగా కొనసాగిస్తామంటూ సందేశం పంపాడు.ఆత్మగౌరవం..కనీసం తన ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా పెళ్లి ప్రతిపాదన తేవడాన్ని చమేలీదేవి వ్యతిరేకించింది. పెళ్లికి యుద్ధానికి లంకె పెట్టడాన్ని తప్పుపట్టింది. అన్నమదేవుడి ప్రతిపాదనను అంగీకరిస్తే నాగవంశీయుల ప్రతిష్ఠకు భంగమంటూ తేల్చి చెప్పింది. పెళ్లితో వచ్చే రాజ్యం, మర్యాదల కంటే యుద్ధంతో తేలే ఏ ఫలితమైనా మేలంటూ తండ్రిని ఒప్పించింది. యుద్ధరంగంలోనే అమీతుమీ తేల్చుకుందామంటూ అన్నమదేవుడికి ఘాటైన సమాధానం పంపింది.ఆత్మార్పణం..లోహండిగూడ వద్ద నాగవంశీయులు, కాకతీయల సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. మహారాజు హరి చంద్రదేవ్‌కు తోడుగా యువరాణి చమేలీదేవి యుద్ధ క్షేత్రానికి చేరుకుంది. యుద్ధం మూడోరోజున తీవ్రంగా గాయపడిన హరి చంద్రదేవ్ మరణించాడు. ఆ మరుసటి రోజు కోటలో రాజు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా వారిని వెంటాడుతూ వచ్చిన కాకతీయ సైన్యాలు కోటను చుట్టుముట్టాయి. తీవ్ర నిర్భంధం మధ్య తండ్రి అంత్యక్రియలను కొనసాగించిన చమేలీదేవీ చివరకు ఆత్మాహుతికి పాల్పడినట్టుగా చెబుతారు. చమేలీదేవి ప్రాణత్యాగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్నమదేవుడికి ఎదురు నిలిచిన వైనం, ఆత్మాభిమానం, «ధైర్యసాహసాలు, రాజకీయ చతురతలపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. అందుకు బస్తర్ దసరా వేడుకల్లో నేటికీ కొనసాగుతున్న సంప్రదాయలే నిదర్శనం.ఆరాధనం..బస్తర్‌లో ఏటా దసరా వేడుకలను 75 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బస్తర్ మహారాజు.. దంతేశ్వరి మాత దర్శనానికి వెళ్లే రథాన్ని మల్లెపూలతో అలంకరిస్తారు. ఈ పువ్వులను చమేలీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. రథం ఆలయానికి చేరిన తర్వాత స్థానికులు ఆ పువ్వులను తమ తలపాగాల్లో ధరిస్తారు గౌరవ సూచకంగా. అనంతరం వాటిని చిత్రకూట్ జలపాతానికి ఎగువ భాగంలో నిమజ్జనం చేస్తారు. అంతేకాదు ఇక్కడున్న అనేక గిరిజన తెగలు చమేలీదేవి ధైర్యసాహసాలు, ప్రాణత్యాగానికి గుర్తుగా కలశాల్లో దీపారాధన చేస్తారు. చమేలీదేవి మరణానికి కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా అన్నమదేవుడే ఈ సంప్రదాయాలకు చోటు కల్పించినట్టుగా చెబుతారు. ఏడువందల ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇటీవలే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇండియా నయాగరాగా పేరొందిన చిత్రకూట్ (ఇంద్రావతి నది) జలపాతం దగ్గర యువరాణి చమేలీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమెను గౌరవించింది. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి, కొత్తగూడెం -
హైదరాబాద్ లో ఘనంగా తనిష్క్ కాకతీయ కలెక్షన్స్ ప్రారంభం (ఫోటోలు)
-
ఎలక్ట్రిక్ వాహనం వాడే ప్రతిఒక్కరికి ఇది ఒక శుభవార్త..!
-
మురిసిపోయిన కాకతీయులు నడయాడిన నేల (ఫొటోలు)
-
వరంగల్ గడ్డపై అడుగుపెట్టిన కాకతీయ వంశ 22వ వారసుడు
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. ఈ నేపథ్యంలో తమ పూర్వీకులు పాలించిన ప్రాంతాన్ని 700 ఏళ్ల తరువాత కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్‌చంద్ర బంజ్‌దేవ్ దర్శించుకోనున్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా బంజ్‌దేవ్ గురువారం ఉదయం వరంగల్‌కు విచ్చేసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‌దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారువరంగల్ రాకపై ‘సాక్షి’ ప్రత్యేకంగా మహారాజుతో ముచ్చటించింది. పూర్వీకులు సాగించిన పాలన, ఓరుగల్లు వైభవం గురించి ఆయన అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తల్లి చెంతకు చేరుకున్నట్లు ఉంది... కాకతీయ వంశ వారసునిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రానుండటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయింది. వరంగల్ ప్రజలతో వీడదీయరాని ఆత్మీయ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. వరంగల్ గురించి, కాకతీయ వైభవం గురించి నాకు ఎప్పటి నుంచో అవగాహన ఉంది. నేను ఉన్నతవిద్య కోసం లండన్ వెళ్లా. మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సైన్స్, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశా. 2009లో తిరిగి భారత్‌కు వచ్చా. ఇప్పుడు నా మూలాలను వెతుక్కుంటూ మళ్లీ ఓరుగల్లుకు వస్తున్నా. విద్యుత్ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ప్రజాపాలన సాగించింది మా పూర్వీకులే... రాచరిక చరిత్రలో ప్రజాపరిపాలన సాగించింది కేవలం కాకతీయులు మాత్రమే. మా పూర్వీకులు ప్రజల కోసం ఎన్నో బహుళార్ధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు నిర్మించారు. అందుకే ప్రజలు మా వంశీయులని రాజుగా కాకుండా దేవుడిగా చూస్తారు. కాకతీయ రాజుగా ఉన్నందుకు గర్విస్తున్నాను. వరంగల్ ప్రజలు ఎప్పుడూ నా వాళ్లే. వారి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. తెలంగాణలోని టార్చ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేయనున్నా. కాకతీయ సంస్కృతిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన అవసరముంది. కాకతీయ గత వైభవానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథస్తం చేస్తా. బస్తర్ కేంద్రంగానే కాకతీయుల పాలన... బస్తర్ వేదికగా రాజ్య పరిపాలన ప్రారంభించింది కాకతీయ రాజులే. 22 తరాలుగా మా వంశీయులు కాకతీయ మూలాలతోనే రాజ్య పరిపాలన చేశారు. మేము కాకతీయ రాజులమేనని పలు శాసనాల్లో ఆధారాలున్నాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన మెమొరాండం ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ పుస్తకంలో కూడా మేము కాకతీయ రాజులమేనని ప్రస్తావించింది. బస్తర్ వేదికగా ఉన్న పలు శాసనాల్లో కూడా మా వంశం గురించి పొందుపరిచారు. నేటికీ మా సామ్రాజ్యం బస్తర్‌లో విస్తరించి ఉంది. నేను జగదల్పూర్లో ఉన్న కోటలో ఉంటున్నా. అన్ని ఆయుధాలూ వాడగలను.. నాకు అన్ని రకాల ఆయుధాలు వాడటంలో ప్రావీ ణ్యముంది. గోల్ఫ్, ఆర్చరీ, పోలో ఆడతాను. ఫైరింగ్ అంటే ఇష్టం. నేను శాకాహారిని, మద్యపానం అలవాటులేదు. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో కలుస్తుంటా. అందులో సామాన్యులు ఉన్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. కాకతీయ వైభవ సప్తహం కార్యక్రమాలకు నన్ను ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జగదల్పూర్లోని నా ప్యాలెస్‌కి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించిన చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు ప్రత్యేక ధన్యావాదాలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాకతీయ సప్తాహాం.. ఓ కొత్త కోణం
కాకతీయులకు ఏడు అంకెపై మక్కువ ఎక్కువ. కాకతీయుల చరిత్ర, వారి జీవనశైలి, ఆనాటి పాలన పద్దతులు తదితర అంశాలను పరిశీలిస్తే అంతర్లీనంగా అన్నింటా ఏడు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. గుండయ నుంచి రుద్రమమీదుగా ప్రతాప రుద్రుడి వరకు కాకతీయులు ఏడుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారనే అంశాలపై కచ్చితమైన వివరణ, సమాధానాలు లభించలేదు. కానీ ఏడుకు ప్రత్యేక స్థానం అయితే లభించింది. అందుకు అద్దం పట్టే ఉదాహరణలను కోకొల్లలుగా చూపించవచ్చు. మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి. కాకతీయ శిల్ప కళావైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కాకతీయ శిలా తోరణ ద్వారాల్లోని మధ్య భాగంలో తామర మొగ్గల లాంటి నిర్మాణాలు ఏడు ఉన్నాయి . కాకతీయ కళాతోరణ పరిణామ క్రమంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న తోరణాలు ఏడు. అవి 1. అనుమకొండ కోట ప్రవేశ ద్వారాలు 2.కొలనుపాక తోరణం 3. వెల్దుర్తి తోరణం 4. ఐనవోలు దేవాలయ తోరణాలు 5. నందికంది తోరణం 6. రామగుండం తోరణం 7. వరంగల్ కీర్తి తోరణం ఏడు కోటలు కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు నగరం చుట్టూ ఏడు కోటలు ఉండేవి. అందుకే ఓరుగల్లు కోటకు సప్త ప్రకార పరివేష్టిత నగరమని ఏకామ్రనాథుడు రాసిన 'ప్రతాపరుద్రచరిత్ర' పేర్కొంది. ఈ ఏడు కోటలు ఇలా ఉన్నాయి. 1 .మట్టి కోట 2. పుట్ట కోట 3. కంప కోట 4. కంచు కోట 5. గవని కోట 6. రాతి కోట 7. కత్తికోట ఇందులో ప్రస్తుతం రాతి కోట, మట్టి కోట దాదాపు పూర్తిగా కనపడుతుండగా పుట్ట కోట వరంగల్ నగర పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. గిరి దుర్గాలు రాజ్యం సరిహద్దుల్లో గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కాకతీయులు అక్కడ ఉన్న కొండలపై సైనిక స్థావరాలుగా ఏడు గిరి దుర్గాలను నిర్మాణం చేసుకున్నారు . అవి 1. ప్రతాపగిరి కోట 2. గొంతెమ్మ గుట్ట 3. కాపురం గుట్టలు 4. నందిగామ కోట 5. మల్లూరు గుట్ట 6. రాజుపేట గుట్టలు 7. ధర్వాజల గుట్టగా ఉన్నాయి. ఇలా ఏడు గిరి దుర్గాలను ఏర్పాటు చేయడంలో మాత్రమే కాకుండా ఆ కోటల నిర్మాణంలో కూడా ఏడు సంఖ్య ఉండడం విశేషం. ఇక్కడా ఏడుకే ప్రాధాన్యం ప్రతాపగిరి కోటకు ఏడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మల్లూరు కోట గోడ ఏడు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దర్వాజల గుట్ట మీద ఏడు దర్వాజలు ఉన్నాయి. ప్రముఖ కాకతీయ ఆలయాలన్ని ఏడు రాతి పలకల వరుసల వేదికపై నిర్మాణం చేయబడ్డాయి. హన్మకొండలోని ప్రముఖ జైన కేంద్రమైన అగ్గలయ్య గుట్ట మీదనున్న జైన తీర్ధంకరుల శిల్పాల సంఖ్య ఏడు. వరంగల్ కోటలోని ప్రసిద్ద శంభుని గుడి ప్రాంగణంలో ఉన్న మంటపం ఏడు స్తంభాలతో నిర్మాణం జరిగింది. పాలనలో కాకతీయులు వారి నిర్మాణాలల్లో మాత్రమే కాకుండా పాలనా విధానంలో కూడా ఏడు సంఖ్యను ఉపయోగించారు. వారి పాలనా కాలంలో ప్రజా సంక్షేమంకోసంగాను సప్త సంతానాల కల్పన కోసం కృషిచేశారు. సప్త సంతానాలు: 1. స్వసంతానం 2. వన ప్రతిష్ఠ 3. దేవాలయ నిర్మాణం 4. అగ్రహార నిర్మాణం. 5. ప్రబంధ రచన 6. ఖజానా అభివృద్ధి 7. తటాక నిర్మాణం. సప్త మాతృకలు శైవ మతాన్ని ఎక్కువగా అవలంబించిన కాకతీయ పాలకులు పరాశక్తి స్వరూపమైన అమ్మవార్లను కూడా ఆరాధించారు . ఆ అమ్మవార్లు ఏడుగురు ఉండడం విశేషం. సప్తమాతృకలు : 1.బ్రహ్మాణి 2. మహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారాహి 6. నారసిమ్హి 7. ఐంద్రీలుగా పూజించారు. సరస్సుల్లోనూ ఇలా పై అంశాలన్నింటిని పరిశీలించి చూస్తే కాకతీయ పాలకులు ఏడు అనే సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారని తెలుస్తోంది. కాకతీయులు తవ్వించిన ప్రముఖ సరస్సులు 1. రామప్ప 2. పాఖాల 3. గణపసముద్రం 4. లక్నవరం 5. బయ్యారం 6. ఉదయ సముద్రం 7. రంగ సముద్రం. ఏడు బావులు నీటి పారుదల రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన కాకతీయ పాలకులు ఓరుగల్లు రాతి కోట పరిధిలో 7 మెట్ల బావులను నిర్మాణం చేశారు. శృంగార బావి 2. మెట్ల బావి 3. ఈసన్న బావి 4. అక్కా చెల్లెళ్ళ బావి 5. సవతుల బావి 6. కోడి కూతల బావి 7. గడియారం బావి. కోటలో ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి పొందిన ఓరుగల్లు రాతి కోట నుండి మధ్య కోట భాగంలో ప్రస్తుతం కాకతీయ కాలం నాటి ఏడు చారిత్రక కట్టడాలు ఉండడం విశేషం. శివాలయం 2. విష్ణు ఆలయం 3. వెంకటేశ్వర ఆలయం 4. కొండ మసీదు 5. నేల శంభుని అలయం 6.అశ్వ శాల 7. వీరభద్ర ఆలయం కాకతీయులు- కొండపాక సిద్దిపేట జిల్లాలో ఒక మండల కేంద్రం కొండపాక. జిల్లా కేంద్రం సిద్దిపేటకు 17 కి.మీ. దూరంలో ఉంటుంది. కొండ పక్క ఉండటంతో దీన్ని ‘కొండపక్క’ అని పిలిచేవారని, అదే క్రమంగా ‘కొండపాక’గా స్థిరపడిందని తెలుస్తోంది. కొండపాకలోని రుద్రేశ్వరాలయం ప్రాచీనమైంది. సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం కాకతీయ రుద్రదేవుడి కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కాకతీయుల కాలంలో ఇది సైనికుల విడిది ప్రదేశంగా ఉండేదట. ఏడు సంఖ్యతో కొండపాకకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏడు గ్రామాలు కలిసి ఇది ఏర్పడింది. ఏడు చెరువులు, ఏడు ఆంజనేయస్వామి ఆలయాలు, ఏడు పోచమ్మ గుళ్లు, ఊరి చుట్టూ ఏడు గుట్టలు, గ్రామం మధ్యలో ఏడు నాభి శిలలు నెలకొల్పారు. ఊరికి పశ్చిమంగా రాముని గుట్టలు అనే కొండల వరుస ఉంది. వీటిలో ఒకదాని మీద రామాలయం నిర్మించారు. పశ్చిమ చాళుక్యులు,కాకతీయులకు చెందిన శాసనాలు ఇక్కడి శివాలయ స్తంభాల మీద కనిపిస్తాయి. - ఖమ్మం జిల్లా జూలూరుపాడు ప్రాంతంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పోలారం చెరువుకు అనుసంధానంగా ఏడు చెరువులు, కుంటలను గొలుసుకట్టుగా నిర్మించారు. - 1296లో నిర్మాణం చేయబడ్డ మెదక్ కోట ఏడు ప్రవేశ ద్వారాలతో నిర్మాణం చేయబడడం గమనార్హం . - వరంగల్ రురల్ జిల్లాలోని కోగిల్వాయి సమీపంలోని చారిత్రిక చంద్రగిరి గుట్టల్లో కాకతీయ కోట ఆనవాళ్లతో పాటు ఏడు నీటి గుండాల నిర్మాణం జరిగింది. - హిడింబాశ్రమంగా పేరుగాంచిన మెట్టు గుట్టపై సైతం ఏడూ గుండాలు ఉండడం విశేషం. - కాకతి రుద్రదేవుడు ప్రస్తుత సిద్ధిపేట జిల్లాలోని వెల్డుర్తిలో స్వయంగా ప్రతిష్టాపన చేసాడని చెప్పబడే గొనె మైసమ్మకి ( దేవతల చెరువు సమీపంలోని ఆలయంలో ఉన్న అమ్మవారు ) ఏడు సంవత్సరాలకొకసారి ఏడు రోజుల పాటు జాతర నిర్వహించడం తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. కాకతీయుల కాలంలో వాణిజ్య రంగంలో 7 రకాల నాణేలు చలామణిలో ఉండేవి. ఇలా కాకతీయుల కాలంలో ఏడుకు ప్రత్యేక స్థానం దక్కిందనే భావనకు మద్దతుగా అనేక ఉదాహారణలు చరిత్రలో కనిపిస్తున్నాయి. వరహాలు : వరహా ముద్ర కలిగిన బంగారు నాణేలు. గద్యానం : వరహా మాడ : వరహా లో సగం రూక : మాడలో పదవ భాగం పణం : వెండినాణెం (1, 1/2, 1/4, 1/8 విలువ కలిగినవి) చిన్నం : వరహాలో 8 వ భాగం తార : అతి చిన్న నాణెం -
పునర్నిర్మాణంతో పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: దేవునిగుట్ట ఆలయం.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్‌కోర్‌వాట్ (ఆంకోర్‌వాట్) కంటే ముందు ఆ తరహా నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న దేవాలయం. ఇసుక రాతి బిల్లలపై ముందుగానే దేవతామూర్తుల భాగాలను చెక్కి పూర్తిరూపం వచ్చేలా క్రమపద్ధతిలో పేర్చిన గొప్ప నిర్మాణం. ఈ తరహా నిర్మాణం దేశంలో ఇదొక్కటే అనే అభిప్రాయం ఉంది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం నిర్మితమైనట్లు భావిస్తున్న ఈ ఆలయం ఎప్పు డు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇంతకాలం తర్వాత దీని పునరుద్ధరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని పూర్తిగా విప్పదీసి తిరిగి నిర్మించబోతున్నారు. త్వరలో టెండర్లు పిలిచి ఏడాదిలో పునర్నిర్మాణాన్ని పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య చొరవతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో, తెలంగాణ వారసత్వ శాఖ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ. దూరంలోని కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై ఈ ఆలయం ఉంది. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో మందిరాన్ని నిర్మించి ఉంటారని అంచనా. పద్మపాణిగా భావిస్తున్న శిల్పం ఏం చేస్తారు? దేవునిగుట్ట ఆలయం దాదాపు 24 అడుగుల ఎత్తుంది. దేవతామూర్తుల ఆకృతులను ఒకే రాయిపై కాకుండా, చిన్నచిన్న రాళ్లపై చెక్కి, వాటిని క్రమపద్ధతిలో పేర్చటం ద్వారా మూర్తు లకు పూర్తి రూపమిచ్చారు. ముందుగా ఈ రాళ్లపై నంబర్లు రాసి విప్పదీస్తారు. నిర్మాణాన్ని పూర్తిగా విప్పిన తర్వాత పునాదిని పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న ఆలోచన ప్రకారం.. డంగు సున్నంతో పునాదిని నిర్మిస్తారు. దానిమీద, నంబర్ల ప్రకారం రాళ్లను పేర్చి పాత రూపమిస్తారు. రాయిరాయికి మధ్య డంగుసున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి తదితర మిశ్రమంతో బైండింగ్ పొర ఏర్పాటు చేస్తారు. ఇలా పిరమిడ్ తరహాలో పైకి పేర్చుకుంటూ వెళ్తారు. పైభాగంలో ప్రస్తుతం పెద్ద రంధ్రం ఉంది. అం దులోంచి వాననీరు లోనికి చేరుతోంది. కొత్త నిర్మాణంలో ఇలాంటి లోపాలను సరిదిద్దుతా రు. రాళ్లు మళ్లీ కదిలిపోకుండా స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలను బిగించే యోచనలో ఉన్నారు. రూ.2 కోట్లతోనే పనులు.. ములుగు జిల్లా కలెక్టర్ అందజేసిన రూ.1.8 కోట్ల నిధులకు కాస్త జోడించి రూ.2 కోట్లలోనే పనులు పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. ఈ మేరకే టెండర్లు పిలువబోతున్నారు. కాకతీయ నిర్మాణాల పునరుద్ధరణ పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకే అవకాశం ఇవ్వనున్నారు. 6 నెలల నుంచి ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రేన్ లేకుండా.. ఈ ఆలయం గుట్టపైన ఉంది. రోడ్డు మార్గం లేకపోవడంతో క్రేన్‌ను పైభాగానికి తరలించే వీలు లేదు. క్రేన్ లేకుండా గొలుసులు ఏర్పాటు చేసి వాటితో రాళ్లను ఎత్తే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆలయానికి వినియోగించిన రాళ్లు కదిలాయే తప్ప, విరగలేదని గుర్తించారు. ఇటీవల డాక్యుమెంటేషన్ చేసే క్రమంలో త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించి లేజర్ చిత్రాలు తీసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడెక్కడ పగుళ్లున్నాయి.. బేస్మెట్ ఎలా ఉంది.. తదితర వివరాలు గుర్తించారు. ప్రత్యేకంగా కొత్తగా రాళ్లను చెక్కాల్సిన అవసరం లేదని గుర్తించారు. -
పురాతన దేవాలయాలు.. పిల్లలమర్రి శివాలయాలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆ ఊరు పేరు వినగానే పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడు భక్త జనానికి ఆరాద్య దైవంగా వెలుగొందుతున్నారు. అంతేకాకుండా పురాతన దేవలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కళామతల్లికి నిలయమై, ఎన్నో శివాలయాలకు వేదికైంది. "వాణి నా రాణి" అని చెప్పి మెప్పించిన పిల్లలమర్రి పిన వీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ పిల్లలమర్రి. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కి వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ముఖధ్వారం ఉంది. అంతేకాదు మూసీ కాలువ పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లంగానే పిల్లలమర్రి గ్రామం వచ్చేస్తుంది. (చదవండి: ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’) శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు... పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు కాకతీయులు సేనానులుగా, మహా సామంతులుగా ఆమనగల్లు, ఎలకతుర్తి, పిల్లలమర్రి ప్రాంతాలను పరిపాలించారు. మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు. అనంతరం తన రాజధానిని పిల్లలమర్రికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. ఇప్పుడున్న గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప వటవృక్షం (మర్రిచెట్టు) ఉండేది. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు క్రింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. రాతి దూలాలపై పురాణ గాథాలు..... క్రీ.శ 1195 నాటికి పిల్లలమర్రి బాగా ప్రసిద్ధి పొందింది. కాకతీయ రుద్రదేవుని మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. రేచర్ల నామిరెడ్డి నిర్మించిన త్రికూటాలయంలో మూడు శివాలయాలున్నాయి. నామిరెడ్డి తన తండ్రిపేరు మీద కామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, తన పేరు మీద నామేశ్వర లింగాలను ప్రతిష్టించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో మరో నామేశ్వరాలయం కూడా ఉంది. అది 1202లో నిర్మించబడింది. తెలుగు భాష మాట్లాడేవారందర్నీ మొదటిసారిగా ఏకం చేసిన వారు కాకతీయులు. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుకసాని పిల్లలమర్రిలో తన పేరుమీద ఎరుకేశ్వరాలయాన్ని నిర్మించి శాసనం వేయించింది. ఆలయం సమీపంలో సుబ్బ సముద్రాన్ని తవ్వించింది. దేవాలయంలో పూజల నిమిత్తం భూధానం చేసింది. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతి దూలాలపై భారత రామాయణ గాథలు, సముద్ర మధనం, వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలు... నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్త స్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తున్నాయి. నిర్మాణంలో ఇసుక పోసి ఏనుగులతో పెద్ద పెద్ద బండలను ఎక్కించినట్లు తెలిసింది. దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు,వాయిద్యకారుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేవాలయాలు శివరాత్రి శోభకు ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. (చదవండి: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
ఎండకు ఎండి.. వానకు తడిసి..
ఇవన్నీ కాకతీయుల కాలంలో అద్భుత నైపుణ్యంతో చెక్కిన శిల్పాలు. దాదాపు ఎనిమిది వందల ఏళ్లక్రితం రూపుదిద్దుకున్న అపురూప శిల్పాలు ఇప్పుడు ఇలా అవగాహనలేమితో నిర్లక్ష్యానికి గురై ధ్వంసమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలోని అతి పురాతన శంభుదేవుని ఆలయం ప్రాంగణంలోని శిథిల కోనేరు గట్టునానుకుని వీటిని ఇలా పడేశారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, నజీరుద్దీన్‌లు ఇచ్చిన సమాచారంతో, వారితో కలిసి పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆదివారం వాటిని పరిశీలించారు. దేవాలయ నిర్వాహకులతో చర్చించి వాటిని ఆలయం మండపంలో ఏర్పాటు చేసి, వాటి కాలానికి సంబంధించిన నామఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అరుదుగా ఉండే రెండంతస్తుల కాకతీయ మండపానికి అనుకుని ఇతర నిర్మాణాలు చేపట్టి దాని చారిత్రక ప్రాశస్త్యం కోల్పేయేలా చేయటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో బాదామీ చాళుక్యుల కాలం ఏడో శతాబ్దినాటి శివలింగం, నాగ ప్రతిమలు, 11వ శతాబ్ది నాటి పార్శ్వనాథుడి జైన విగ్రహం, 1296 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం ఉన్నాయి. -
అపురూప కళా వైభవానికి ఆదరణ కరువు
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొండలు. అబ్బురపరిచే శిల్ప సంపద. ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలతో కళకళలాడిన శివాలయం.. నేడు శిథిలావస్థకు చేరుకుంది. కాకతీయ శిల్పకళా ప్రతిభకు తార్కాణంగా నిలి చిన ఈ ఆలయం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండ లంలోని గొడిశాల గ్రామంలో ఉంది. తూర్పు ము ఖం కలిగి ఉన్న ఈ దేవాలయం నక్షత్రం ఆకారంలో ఉంది. ముఖ మండపానికి ఉత్తర, పడమర, దక్షిణ దిక్కల్లో గర్భగుడులు ఉండగా తూర్పు దిక్కున ప్రవే శ మండపం ఉంది. ఈ మూడు గర్భగుడుల్లో శివుడిని లింగం రూపంలో ప్రతిష్టించారు. పురావస్తు శాఖ పట్టించుకోకపోవడంతో శిల్ప సంపద చెల్లాచెదురు గా పడి ఉంది. ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని పునర్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలుగు పద్యాలతో శాసనం.. గొడిశాల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నాయి. పురాతన శాసనాల్లో గొడిశాల గ్రామాన్ని ఉప్పరపల్లిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ.1236 కాకతీయ గణపతి దేవుడి కాలంలో గ్రాంధిక భాషలో కావ్య శైలిలో వేయించిన శాసనం ఒకటి ఉంది. తెలు గు పద్యాలతో ప్రారంభమైన ఈ శాసనంలో వినాయకుడు, దుర్గ, వరాహ రూపంలో ఉన్న విష్ణు మూర్తిని, సూర్యుడిని స్తుతించారు. రాజనాయకుడు, రవ్వ మాంబ దంపతులకు జన్మించిన కాటయ..పంచ లింగాలతో ఈ శివాలయాలను నిర్మించాడు. ఆలయ నిర్మాణం మాత్రమే కాకుండా చెరువులను కూడా తవ్వించాడు. ధూప దీప నైవేద్యాల కోసం బ్రాహ్మణులకు పించరపల్లి అనే గ్రామా న్ని దానంగా ఇచ్చాడు. తాటి వనాన్ని, అంగడి సుం కాన్ని, మామిడి తోటలను కూడా దానం చేశాడు. రుద్రదేవుడి, గణపతి దేవుడి ప్రశంసలతోపాటు కాట య గురించి కూడా శాసనంలో వర్ణించారు. శాసనం చివరి భాగంలో ఈ ఆలయానికి గణపతి దేవ చక్రవర్తి కూడా భూ దానం చేసినట్లు రాశారు. శాసనంలో పేర్కొన్న పంచ లింగాలలో 3 త్రికుటాలయంలో ఉండగా, మరో 2 పక్కనే ఉన్న వేర్వేరు ఆలయాల్లో ప్రతిష్టించి ఉన్నాయి. (ప్రస్తుతం పునర్ నిర్మాణం కోసం ఆలయ స్తంభాలన్నీ విప్పి పెట్టారు). ఢిల్లీ సుల్తానులకు, కాకతీయులకు యుద్ధం జరిగిన ప్రదేశం.. ఉప్పరపల్లి గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1303లో ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ.. మాలిక్ ఫక్రోద్దిన్, జునాఖాన్ల నాయకత్వంలో ఓరుగల్లు పైకి మొదటిసారి తన సేనలను దండయాత్రకు పం పాడు. కాకతీయ సైన్యాలు పోతుగంటి మైలి, రేచర్ల వెన్న భూపాలుడు, మంగయ దేవుడు ఇతర సేనాల నాయకత్వంలో ఇక్కడే అడ్డుకుని తిప్పి పంపారు. పునర్నిర్మాణ పనులు చేపట్టాలి.. చారిత్రక నేపథ్యం ఉన్న కాకతీయ ఆలయం నేడు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఆలయం చుట్టు పక్కల అనేక వందల స్తంభాలు, శిథిలాలు పడి ఉన్నాయి. ఇప్పటికైనా పురావస్తు శాఖ స్పందించి ఆలయాన్ని పునర్ నిర్మించాలి. – రామోజు హరగోపాల్, తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ -
కాకతీయ కాలువకు పెరిగిన నీటి విడుదల
బాల్కొండ : ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కుల నుంచి 6500 క్యూసెక్కులకు నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం పెంచారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని నీటి విడుదలను పెంచినట్లు వారు తెలిపారు. సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(90టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1059.40(12.95 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పెరగడంతో జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి పెరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. మూడు టర్బయిన్ల ద్వారా 10.70 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. -
మరుగున పడుతున్న చారిత్రక కట్టడం
-
శభాష్.. ఛాయాబాయి
చీర సాయంతో ప్రాణభిక్ష పెట్టిన మహిళ బాల్కొండ : ఎస్సారెస్పీ కాలనీలో నివసించే ఛాయాబాయి.. తన సాహసంతో ముగ్గురి ప్రాణాలను నిలిపింది. కాకతీయ కాలువలో కొట్టుకుపోతున్న వారిని కాపాడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి ఆమె మాటల్లోనే.. ‘‘సోమవారం సాయంత్రం యాల్ల మా కాలనీకి చెందిన సోను కాకతీయ కాలువ ఒడ్డుకు వెళ్లి అందులో జారీ పడిపోయాడు. సోనును కాపాడేందుకు మా కాలనీలో పదో తరగతి చదువుతున్న కూనల్ కాలువలోకి దిగాడు. అతడూ జారి పడి కొట్టుకుపోసాగాడు. మా ఇంటి పక్కన ఉండే 50 ఏండ్ల దేవిదాస్ వాళ్లను కాపాడడానికి ప్రయత్నించి, అతడూ జారిపడిపోయాడు. విషయం తెలిసి నేనూ అక్కడికి వెళ్లాను. వెంటనే చీరను విడిచి వాళ్లవైపు విసిరాను. వాళ్లకు అందకపోవడంతో ధైర్యం చేసి కాలువలోకి దిగాను. దేవిదాస్, కునాల్ చీరను అందుకుని మెల్లిగా ఒడ్డుకు చేరారు. తర్వాత సోను కూడా ఒడ్డుకు చేరాడు.’’ అని ఛాయాబాయి వివరించింది. పారుతున్న నీళ్లను చూస్తే భయమేసినా.. ముగ్గురి ప్రాణాలను కాపాడడానికి సాహసం చేశాను.. కష్టాల కడలిలోంచి.. ఛాయాబాయి జీవిత నేపథ్యం కష్టాల కడలిలో సాగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పనుల కోసం మహారాష్ట్ర నుంచి పలు కుటుంబాలు ఇక్కడికి వలసవచ్చాయి. అలా వచ్చిన లక్ష్మీబాయి, లింబాజీల ఎనిమిది సంతానంలో నాలుగో సంతానం ఛాయాబాయి. ఆమెకు ప్రస్తుతం 35 ఏళ్లుంటాయి. మానసిక పరిస్థితి బాగా లేదన్న కారణంతో ఒక పాప పుట్టాక భర్త వదిలేశాడు. ప్రస్తుతం ఆమె స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో ఆయాగా పని చేస్తూ కూతురును పోషించుకుంటోంది. ఆమె తన సాహసంతో ముగ్గురిని కాపాడినందుకు గ్రామస్తులు అభినందిస్తున్నారు. కునాల్ సాహసం తక్కువేమీ కాదు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాలనీకి చెందిన కునాల్ సాహసం తక్కువేమీ కాదు. అతడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోlతరగతి చదువుతున్నాడు. కునాల్ సాయంత్రం వేళ కాకతీయ కాలువ వైపు వెళ్లాడు. అక్కడ ఒడ్డుపై జనం కనిపించడంతో అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, కాలువలో పడి ఉన్న సోనును రక్షించడానికి నీళ్లలోకి దూకేశాడు. ఆ సమయంలో కాకతీయ కాలువలో 6,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అయినా భయపడకుండా ఒకరిని రక్షించడానికి యత్నించి అందరి అభిమానాల్ని చూరగొన్నాడు. ఛాయబాయి సహసం చేసి తన ఒంటి మీద ఉన్న చీరను విడిచి కాకతీయ కాలువలో కొట్టుకు పోతున్న మగ్గురికి ప్రాణ భిక్ష పెట్టింది. ఛాయ బాయి చదువు కోలేదు. కాని ఆమేకు వచ్చిన ఆలోచన ఆమోఘం అద్భుతం. ఆమే సమయ స్పూర్తికి అందరు ఆశ్చర్య పోవల్సిందే. కాలనీ వాసులు అందరు ఒక్కోSక్కరు సంఘటన స్థలానికి తరలి వచ్చి కొట్టుకు పోతున్న వారిని చూసి రోధిస్తున్నారే తప్ప ఒక్కరు కూడ కాపాడటానికి ప్రయాత్నం చేయడం లేదు. కాని ఛాయబాయి ఒక్క క్షణం ఆలోచించకుండ తన ఒంటి పై ఉన్న చీరను వదిలి కాలువలో కొట్టుకు పోతున్న వారికి అందించింది. చీరతో పాటు తనను కాలువలోకి లాగుతున్న ఆధైర్య పడకుండ ఒడ్డు ను గట్టిగ పట్టుకుంది. -
కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4200 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 900 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1074.60(38.77టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. రెండు టర్బయిన్ల ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. -
సరిగమల శిల్ప సంపద!
పుణ్యతీర్థం రాజుల కాలం పోయింది. రాజ్యాలు అంతరించాయి. అప్పట్లో కాకతీయులు నిర్మించిన కట్టడాలు, ఆలయాలు అప్పటి కళావైభవం, భక్తి భావానికి ప్రతీకగా... చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. శివుని మీద ఉన్న అపారమైన భక్తితో కాకతీయులు రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. వరంగల్ జిల్లాలో నిర్మించిన కాకతీయ కట్టడాలన్నింటిలోనూ రుద్రేశ్వరుడిని ప్రతిష్టించి దైవభక్తి, ప్రత్యేకతను చాటారు. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. 40 ఏళ్ల పాటు ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరునే ఆలయానికి నామకరణం చేయడం కాకతీయుల గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక పద్ధతులతో ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రపంచ వారసత్వ సంపదగా పిలువబడుతున్న రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించినట్లయితే భవిష్యత్ తరాలకు వరంగా మారనుంది. 803 ఏళ్ల కట్టడం రామప్ప దేవాలయం నిర్మించి 803 ఏళ్లు దాటినా ఆలయ శిల్పాలు చెక్కు చెదరలేదు. ఆలయం నిర్మించిన 1213 నుండి 1323 వరకు ఇక్కడ నిత్య పూజలు జరిగాయి. కాకతీయ సామ్రాజ్యం ఆనంతరం 1910 వరకు ఆలయంలో ఎలాంటి పూజలు జరగలేదు. 1911లో నిజాం ప్రభుత్వం రామప్ప ఆలయాన్ని గుర్తించి స్వల్ప మరమ్మతులు చేపట్టి ఆలయాన్ని వినియోగంలోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఏటా రామప్పలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, అగ్నిగుండాలలో నడిచే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విద్యుత్తు లేకుండా వెలుగు ఆలయ గోపురాన్ని నీటిలో తేలాడే ఇటుకలతో నిర్మించారు. గోపురం ఇటుకలను తీసి నీళ్లలో వేస్తే అవి తేలుతాయి. ఇలా మరెక్కడా జరగదు. రామప్ప రామలింగేశ్వరునికి మరో ప్రత్యేకత ఉంది. ఏ ఆలయంలో అయినా గర్బగుడిలో వెలుతురు ఉండదు. అన్ని చోట్ల విద్యుత్ బల్బులు ఏర్పాటు చేస్తారు. రామప్ప ఆలయంలో మాత్రం సూర్యోదయం నుండి సుర్యాస్తమయం వరకు గర్భగుడిలోని రామలింగేశ్వరుడు కాంతివంతంగానే దర్శనమిస్తాడు. ఆలయంలో ఎర్పాటు చేసిన మంటపం స్థంభాలపై పడే సూర్యకాంతి పరావర్తనం(రిఫ్లెక్ట్) చెంది గర్భగుడిలోని శివలింగం కాంతివంతంగా దర్శనమిస్తుంది. పూజలకు సంబంధించీ ఇక్కడ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఆలయంలో మధ్యాహ్నం వరకే పూజలు నిర్వహిస్తారు. రామప్ప ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. ‘ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు, ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అర్చన పూజలు నిర్వహిస్తాం’ అని ఆలయ పూజారులు కోమల్లపల్లి హరీష్‌శర్మ, ఉమాశంకర్ లు వివరించారు. శిల్పకళా అందాలు రామప్పకే సొంతం రామప్ప ఆలయం శిల్ప కళాసంపదకు ప్రసిద్ధి. శిల్పాలను నిశితంగా పరీశీలిస్తే... ద్వాపర, త్రేతాయుగాల చరిత్ర, జైన, బౌద్ధ మతాల అంశాలు, ఈజిప్టు మమ్మీలు, వాస్తు, జ్యోతిష్యం, నాట్యం, నీతి, శంగారం, లౌకితత్వం, చరిత్ర, హేతువాదం, క్రీడలు, అధునిక సైన్స్ పరిజ్ఞానం శిల్పాల్లో కనిపిస్తుంది. ఆలయంలో తూర్పు ముఖద్వారం వైపు గణపతి విగ్రహాన్ని ఎర్పాటు చేశారు. ఆలయంలోని స్థంభానికి దిష్టిచుక్క పెట్టారు. ఈ అంశాలను పరిశీలిస్తే కాకతీయులు ఆ కాలంలోనే వాస్తును బాగా నమ్మినట్టు తెలుస్తోంది. గర్భగుడికి ఎడమవైపున ఉన్న పొన్న చెట్టు శిల్పాన్ని చేతి వేళ్లతో గీటితే సంగీత(సరిగమపదనిస) స్వరాలు వినిపిస్తాయి. తేలియాడే ఇటుకలు గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు 40 ఏళ్ల పాటు ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరునే ఆలయానికి నామకరణం చేశారు గోపురం ఇటుకలను తీసి నీళ్లలో వేస్తే తేలి ఉంటాయి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు గర్భగుడికి ఎడమవైపున ఉన్న పొన్న చెట్టు శిల్పాన్ని చేతి వేళ్లతో గీటితే సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఇలా చేరుకోవచ్చు.. వరంగల్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో రామప్ప దేవాలయం ఉంది. హైదారాబాద్ నుండి వచ్చే పర్యాటకులు హన్మకొండకు చేరుకుని అక్కడి నుండి ములుగుకు చేరుకోవాలి. ములుగు నుంచి ప్రైవేటు వాహనాలల్లో రామప్ప గుడికి వెళ్లవచ్చు. ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్ నుంచి వచ్చే పర్యాటకులు భూపాలపల్లి, గణపురం క్రాస్‌కు చేరుకోవాలి. అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. ఖమ్మం, భద్రాచలం మీదుగా వచ్చే వారు జంగాలపల్లి క్రాస్‌రోడ్‌కు చేరుకొని, అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. రామప్పను సందర్శించే పర్యాటకుల, భక్తుల సౌకర్యార్థం టూరిజం శాఖ వారు రామప్ప సరస్సు కట్టపై కాటేజీలు నిర్మించారు. పర్యాటకులు విడిది చేసేందుకు హరిత హోటల్ అందుబాటులో ఉంది. -
‘కాకతీయ’కు పునరుజ్జీవం!
- మూడు నెలల్లో పూర్తి కానున్న ప్రధాన కాల్వఆధునీకరణ పనులు - వేగంగా ప్రధాన కాల్వ ఆధునీకరణ పనులు - రూ.180 కోట్ల పనుల్లో ఇప్పటికే రూ.100 కోట్ల పనులు పూర్తి - దిగువ మానేరు కాల్వ పనులు 70 శాతం పూర్తి - పనులు పూర్తయితే కాల్వల సామర్థ్యం పూర్వ స్థితికి - సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ద్వారా ఉత్తర తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాకతీయ కాల్వ ఆధునీకరణ వేగం పుంజుకుంది. ముప్ఫై ఏళ్ల కింద నిర్మించిన కాల్వకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి ఆధునీకరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాకతీయ కాల్వ ఆధునీకరణ కోసం నాలుగు నెలల కిందట రూ.180 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా అందులో ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. భారీగా తగ్గిన ప్రవాహ సామర్థ్యం.. ఎస్సారెస్పీలో భాగంగా ఉండే కాకతీయ కాల్వ ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో మొత్తంగా 9,68,640 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా ఉండేది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి మానేరు వరకు 146 కిలోమీటర్ వరకు ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం వాస్తవానికి 9,700 క్యూసెక్కులు. కానీ కాల్వలో చాలాచోట్ల పూడిక, పిచ్చిమొక్కలు పెరగడం, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతినడంతో దాని ప్రవాహ సామర్థ్యం 5 వేలకు పడిపోయింది. దీంతో ఎగువ మానేరులో ఉన్న సుమారు 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందడం గగనంగా మారింది. దీంతోపాటే మానేరు దిగువన 146 కిలోమీటర్ నుంచి 234 కిలోమీటర్ వరకు కాల్వ ప్రవాహ సామర్థ్యం 8,505 క్యూసెక్కులు ఉండగా, అది 3 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువన మానేరులో ఉన్న 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాల్వల ఆధునికీకరణ చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావును ఆదేశించారు. దీంతో హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. ఆర్థిక శాఖ అధికారుల సహాయం తో కాల్వ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.185 కోట్లను విడుదల చేసి నామినేషన్ పద్ధతిన అప్పగించారు. రూ.100 కోట్ల పనులు పూర్తి.. పూడిక, మొక్కల తొలగింపుతోపాటు సిమెంట్ నిర్మాణాల బలోపేతానికి సత్వర మరమ్మతులు చేయాలని ఎగువ మానేరు పనులకు రూ.60 కోట్లు కేటాయించగా, దిగువన కాకతీయ కాల్వ 146 కిలోమీటర్ నుంచి 191 కిలోమీటర్ వరకు ఆధునికీకరణ చేసేందుకు రూ.64.25 కోట్లు, 191 కిలోమీటర్ నుంచి 234 కిలోమీటర్ వరకు ఆధునికీకరించేందుకు రూ.60.65 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ పనులను జూన్, 2016 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేస్తే ఒక శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని, ఒకవేళ పూర్తిచేయని పక్షంలో 2% జరిమానా విధించడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా టెండర్ నిబంధనలను సవరించారు.ఈ నిబంధనల నేపథ్యంలో కాంట్రాక్టర్లు పనులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పనులు చేపట్టారు. దీంతో ప్రస్తుతం వరకు దిగువ మానేరులో రూ.125 కోట్ల పనుల్లో 70% పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.80 కోట్ల పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక ఎగువ మానేరులో రూ.60 కోట్ల పనుల్లో 35 నుంచి 40% పనులు పూర్తయ్యాయని మరో రూ.40 కోట్ల పనులు మిగిలాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులకు ఆటంకం జరుగుతోంది. మొత్తంగా రూ.100 కోట్ల పనులు పూర్తవగా, నిర్ణీత గడువులోగా మిగతా పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
కరువు చెప్పిన ‘చరిత్ర’
♦ ఉదయసముద్రంలో బయటపడ్డ ‘శంభులింగాలయం’ ♦ రిజర్వాయర్‌లో నీరు అడుగంటడంతో వెలుగుచూసిన చోళుల కట్టడం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎప్పుడో ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం.. నల్లగొండకు కూతవేటు దూరంలో ఉన్న పానగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించిన కందూరు చోళుల కాలం నాటి కట్టడం.. నల్లగా ధగధగలాడే రాతిస్తంభాలు, గర్భగుడిలో శివలింగం.. 18 స్తంభాలతో కూడిన నిర్మాణం.. వినాయకుడు, నంది విగ్రహాలు ఇలా.. చెక్కుచెదరని శిల్ప కళాచరిత్రను ‘కరువు’ బయటకు తీసింది. కాకతీయ రాజ్య సామంతుల ఏలుబడిలో నిర్మితమైన ‘శంభులింగేశ్వరుడి’ రూపాన్ని సాక్షాత్కరింపజేసింది. ఈ ఏడాది సంభవించిన కరువుతో ఉద యసముద్రం రిజర్వాయర్ అడుగంటింది. దీంతో ఈ గుడి వెలుగులోకి వచ్చింది. గతంలో రెండు, మూడుసార్లు రిజర్వాయర్‌లో నీళ్లులేక ఈ ఆలయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉదయ సముద్రంలో 0.1 టీఎంసీల కంటే తక్కువ నీరు ఉన్నందున మళ్లీ ఈ ఆలయం బయటపడడంతో దాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బయటపడ్డవి ఇవే.. అద్భుత కళా సంపదతో కూడిన రాతి కట్టడమైన ఈ ఆలయం.. నాటి శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఆలయం పైకప్పుపై తామరపువ్వు ఆకారంలో చెక్కిన డిజైనే ఇందుకు నిదర్శనం. తూర్పుముఖంగా నిర్మితమైన ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కట్టబడి ఉందని పురావస్తు అధికారులు చెబుతున్నారు. ఆలయ ముఖ ద్వారానికి ఉన్న గజలక్ష్మి మూర్తి విగ్రహం నాటి ప్రాచీన వైభవానికి ఆనవాళ్లని అంటున్నారు. ఇక.. గర్భాలయానికి ముందు కుడివైపున బొజ్జగణేశుడు, గర్భాలయంలోని లింగానికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నారు. దీంతో పాటు ఆచంద్రార్క శాసనం కూడా వెలుగుచూసింది. ఈ శాసనంపై చంద్రుడు, సూర్యుడు, శివలింగం చెక్కబడి ఉన్నాయి. సూర్య చంద్రులున్నంతవరకు తమ శాసనం ఉంటుందని చెప్పడం వారి ఉద్దేశమని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ శాసనంపై తెలుగు, సంస్కృతాలను పోలిఉన్న భాషలో అక్షరాలున్నాయి. ఈ శివాలయాన్ని మళ్లీ కట్టవచ్చు గుడి దగ్గర కనిపించిన శిల్పరీతులు, ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ ఆలయం 11, 12 శతాబ్దాలకు చె ందినదిగా భావిస్తున్నాం. ఇక్కడి చారిత్రక సంపదనంతా తక్షణమే మ్యూజియానికి తరలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రిజర్వాయర్ పక్కనే స్థలం కేటాయిస్తే అక్కడే ఆలయాన్ని నిర్మించవచ్చు. అప్పుడు పర్యాటకంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత పెరుగుతుంది. -పి. నాగరాజు, అసిస్టెంట్ డెరైక్టర్, పురావస్తు శాఖ -
ఉరేసుకుని మెడికో ఆత్మహత్య
-
తెలంగాణకు మరో 100 ఎంబీబీఎస్ సీట్లు
ఉస్మానియాకు 50, కాకతీయకు 50 సీట్లు వసతులు పరిశీలించిన ఎంసీఐ బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మరో 100 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. ఉస్మానియాకు 50, కాకతీయ మెడికల్ కాలేజీకి 50 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యవిద్యా సంచాలకుడు డా.పుట్టా శ్రీని వాస్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు భారతీయ వైద్య మండలికి చెందిన 2 బృందాలు ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలను సందర్శించినట్లు చెప్పారు. ఆయా మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, పరికరాలు, రోగుల సంఖ్య, ల్యాబ్ సౌకర్యాలను ఎంసీఐ బృందాలు పరిశీలించినట్లు పుట్టా శ్రీనివాస్ చెప్పారు. వారి పర్యటన సంతప్తికరంగా జరిగినట్లు, ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 200, కాకతీయ మెడికల్ కాలేజీలో 150, రిమ్స్‌లో 100, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100, గాంధీలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీల్లో పెంచే సీట్లతో కలిపి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 850 ఎంబీబీఎస్ సీట్లు అవుతాయి. -
'మిషన్' ఆరంభానికి గ్రహణం!
హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకం ఆరంభానికి గ్రహణం పట్టింది. జనవరి చివరి వారంలోనే చెరువుల మరమ్మతు పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినా ఇప్పటికీ కనీసం తేదీలను కూడా ఖరారు చేయలేదు. పనుల అంచనాలు, పరిపాలనా అనుమతులు, టెండర్లు, ఒప్పందాలపై చిన్న నీటి పారుదల శాఖ ఎంతో శ్రమించి అన్నింటినీ సిద్ధం చేసినా.. ముఖ్యమంత్రి స్థాయిలో పనుల ఆరంభ తేదీలపై నిర్ణయం జరగకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. వర్షాకాలానికి మరో మూడు నెలల గడువు మాత్రమే ఉండటం, ఈలోగా సుమారు 9 వేలకు పైగా చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉండటం నీటిపారుదల శాఖ అధికారులను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎప్పటిలోగా నిర్ణయం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. లక్ష్యం 9 వేల చెరువుల పునరుద్ధరణ రాష్ట్రంలో గుర్తించిన 46,531 చెరువుల్లో ఏటా 20 శాతం చెరువులను అంటే సుమారు 9 వేల చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ఏడాది 9,651 చెరువుల పనులను లక్ష్యంగా పెట్టుకున్న చిన్న నీటి పారుదల శాఖ ఇందులో ఇప్పటికే 8 వేల చెరువుల సర్వేలు పూర్తి చేసి, 7 వేల చెరువుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటి వరకు 5,200 చెరువులకు సుమారు రూ.1,600 కోట్ల విలువైన పరిపాలనా అనుమతులు సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2 వేలకు పైగా చెరువుల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పూడికతీత మట్టిని పొలాలకు తరలించేందుకు వీలుగా ఇప్పటికే వ్యవసాయ శాఖ భూసార పరీక్షలను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే 4 వేల చెరువుల మట్టి నమూనాలకు పరీక్షలు సైతం పూర్తి చేశారు. నీటి పారుదల శాఖ అధికారులు అంతా సిద్ధం చేసినా పనుల ఆరంభం మాత్రం జరగడం లేదు. వర్షాకాలానికి కేవలం మూడు నెలల వ్యవధే ఉండటం, పనులు చేయాల్సిన చెరువుల లక్ష్యం భారీగా ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే పునరుద్ధరణ పనులు ఆరంభించాలని నిర్ణయించారు. ఈ పనులను కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఆరంభించాలని ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు సైతం చేసింది. నాలుగు జిల్లాల్లో ప్రతిపాదనలు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకే రోజు పనులు ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు ఆయా జిల్లాల్లో నాలుగేసి చెరువులను ఎంపిక చేసి ప్రతిపాదనలను పక్షం రోజుల కిందట సీఎం కార్యాలయానికి పంపారు. సీఎం తేదీలను నిర్ణయిస్తే పనులను ఆరంభిస్తామని తెలియజేశారు. అయినప్పటికీ ఇంతవరకు సీఎంఓ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దానికి తోడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటం, ఫలితంగా సీఎం బిజీగా మారనుండడంతో ఆరంభ తేదీల నిర్ణయం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే నిర్ణీత లక్ష్యాలను ఎలా చేరుకుంటామన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు మరోమారు ముఖ్యమంత్రిని కలసి ఈ విషయంపై విన్నవించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
రింగ్‌రోడ్డు సంగతేంది
వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి పలు సమస్యలపై అధికారుల నిలదీత వాడివేడిగా ‘కుడా’ సమీక్ష సమావేశం సాక్షి, హన్మకొండ : రింగురోడ్డు అలైన్మెంట్ లో మార్పులు చేయాలని సూచించినా... ఎందుకు సకాలంలో స్పందించడం లేదంటూ కార్పొరేషన్ అధికారులపై ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం ప్రశ్నించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పనుల్లో ఐఏఎస్ అధికారి ముద్ర స్పష్టంగా కనిపించాలన్నారు. తొలి సమావేశం కావడంతో కేవలం సూచనలకే పరిమితమవుతున్నామని, ఇవి మలి సమావేశం కల్లా అమలు కావాలన్నారు. కాకతీయ నగరాభివృద్ధి సంస్థ, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పనితీరుపై హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యామ్నాం 2:30 గంటల వరకు జరిగిన సమావేశానికి ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్‌తో పాటు కలెక్టర్ గంగాధర కిషన్, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సువర్ణా పండదాస్ ఇతర అధికారులు హాజరయ్యారు. వరంగల్ నగరం చుట్టూ నిర్మించనున్న రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పుపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో రూపొందించిన మార్గంలో మార్పులు చేయాలని సూచించి నా... ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదం టూ ఎంపీ కడియం శ్రీహరి అధికారులను నిల దీ ్డశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అలైన్‌మెంట్‌ను అంగీకరిస్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని, కీలకమైన అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండడం మానుకోవాలని అధికారులకు సూచించారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వంపై భారం పడకుండా రింగురోడ్డు మార్గంలో వెంటనే మార్పులు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్‌గా శాలినిమిశ్రా పని చేసిన కాలంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందంటూ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారని గుర్తు చేశారు. అదేవిధంగా సువర్ణపండాదాస్ హయూంలో వరంగల్ న గరంలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారనే పేరు వచ్చేలా పని చేయాలన్నారు. మంచినీటిపై దృష్టి పెట్టాలి నగర ప్రజల మంచినీటి అవసరాలకు 2.5 టీ ఎంసీల నీరు అవసరం... భద్రకాళి, వడ్డేపల్లి, ధర్మసాగర్ చెరువుల ద్వారా ప్రస్తుతం 1.7 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉం ది... దీంతో ఏడాదిలో వంద రోజుల పాటు నీ టికి కొరత ఏర్పడుతుందని..దీన్ని నివారిం చేందుకు ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నగరంలో చెత్త ఎక్కడిక్కడే పేరుకుపోతున్నదని, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మొదటి సమావేశం కాబట్టి అధికారులను ఏమనడం లేదని.. రా బోయే సమావేశం నాటికి ఈ సమస్యలను పరి ష్కరించాలని సూచించారు. ఈ క్రమంలో కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలనిఅడిషనల్ కమిషనర్ శంకర్‌కు సూచించారు. పారిశుద్ధ్యం , పచ్చదనంపై బా ధ్యతలను డివిజన్ అధికారులకు అప్పగించామన్నారు. వేయిస్తంభాల గుడి అభివృద్ధిలో భా గంగా ఆలయం చుట్టూ వంద మీటర్ల వరకు భూమిని సేకరించే పనిని వేగవంతం చేయాల ని ‘కుడా’ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది కూడా మేమే చెప్పాలా... బాలసముద్రంలోని ఏకశిల పార్కులో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహం చీకట్లో ఉంది... కనీసం ఇక్కడ లైటు ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా కార్పొరేషన్ సిబ్బందికి లేదు... పబ్లిక్‌గార్డెన్ కళావిహీనంగా మారింది... పచ్చదనం తగ్గిపోయింది... బల్లలు పాడయ్యాయి. టౌన్‌హాల్ పరిస్థితీ అలానే ఉంది... మ్యూజికల్ గార్డెన్ అసలు ఉందా, లేదా అనే పరిస్థితి ఉంది... ఇలాంటి చిన్నచిన్న విషయాలు సైతం తాుమే చెప్పాలా.. అధికారులకు తెలియవా అంటూ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేయూ జంక్షన్‌ను జయశంకర్ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని, ఇప్పటికైనా కమిషనర్ నగరంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాలని వారు పలు సూచనలు చేశారు. అధ్వానస్థితిలో విలీన గ్రామాలు వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనమైన 42 గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈ గ్రామాల్లో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ఇక్కడ రోడ్లు, మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అంతకుముందు కడియం శ్రీహరి మాట్లాడుతూ అదాలత్ సెంటర్ నుంచి నాయుడు పెట్రోల్ంపు వరకు నిర్మించిన రోడ్డు నాసిరకంగా ఉందన్నారు. దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. నగర పరిధిలో అన్ని రోడ్లు పాడయ్యాయని, దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. -
బస్సు ప్రమాదం పై కేసిఆర్ దిగ్ర్భాంతి