బాల్కొండ : ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కుల నుంచి 6500 క్యూసెక్కులకు నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం పెంచారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని నీటి విడుదలను పెంచినట్లు వారు తెలిపారు. సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(90టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1059.40(12.95 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పెరగడంతో జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి పెరిగిందని జెన్‌కో అధికారులు తెలిపారు. మూడు టర్బయిన్ల ద్వారా 10.70 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్‌కో అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment