ఏలూరు: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు త్రీటౌన్ పోలీసులు పట్టుకున్నారు. నగరానికి చెందిన మేకల శివతేజ పాతనేరస్తుడు. వివిధ కేసుల్లో గతంలో జైలు జీవితం కూడా గడిపాడు. ఇటీవలి కాలంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ1.90 లక్షల విలువైన 9 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై సాగర్ బాబు తెలిపారు.