Published
Sat, Aug 13 2016 10:01 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై మారూఫ్
విజయనగరం పూల్‌బాగ్ : దాసన్నపేట నూకాలమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి రెండు తులాల ఆభరణాలు అపహరించారు. దీనికి సంబంధించి టూ టౌన్ ఎస్సై మారూఫ్ అందించిన వివరాలిలా ఉన్నాయి. అరబిందో కంపెనీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న గోపాలం శ్రీధర్ కుటుంబంతో పాటు నూకాలమ్మ సమీపంలో ఉంటున్నారు. ఈ మధ్య గది కిటికీ పాడవ్వటంతో దానికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఇదే అదునుగా శుక్రవారం రాత్రి దొంగలు కిటికీ గుండా ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న తులంన్నర బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుల\ఫిర్యాదు మేరకు క్రైమ్ సిబ్బందితో పాటు ఎస్సై మారూఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.