భద్రతకు విశ్రాంతి ఉండదు
-
డ్రైవర్లు మద్యానికి దూరంగా ఉండడం ఉత్తమం
-
ప్రమాదం అంటే పలు కుటుంబాల చిన్నాభిన్నం
-
ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు సభలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రాంప్రసాద్
ఒంగోలు : భద్రతకు విశ్రాంతి ఉండదనే విషయం ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రాంప్రసాద్ అన్నారు. గురువారం ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం అన్నారు. మద్యపానం అలవాటుగా మారితే కొన్నాళ్లకు అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, మెదడు అందించే ఆదేశాలను క్షణ కాలంలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తద్వారా డ్రైవర్ చూస్తుండగానే ప్రమాదం జరిగిపోతుందన్నారు. ప్రమాదం జరిగితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని, బాధిత కుటుంబాలు ఆర్థిక, సామాజిక ఇబ్బందులకు గురవుతాయన్నారు. కాలం చెల్లిన బస్సులను సైతం ప్రమాదరహితంగా రోడ్లపై తిప్పిన డ్రైవర్లను అభినందించారు. ఎంవీఐ గోపీనాయక్ మాట్లాడుతూ.. ప్రమాదాలను నివారించే శక్తి డ్రైవర్‌కు మాత్రమే ఉంటుందని, విశ్రాంతి సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం కె.ఆదాంసాహెబ్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్లను డిపోకు 10 నుంచి 15 మందిని గుర్తించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సర్వీసులో కనీసం ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్ల వివరాలు వెల్లడించారు. రీజియన్ స్థాయిలో ముగ్గురు, డిపో స్థాయిలో ముగ్గురు చొప్పున మొత్తం 27 మంది డ్రైవర్లను సన్మానించి, బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ పీఓ సుధాకరన్, పార్శిల్ విభాగం మేనేజర్ శ్రీమన్నారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా 40 మంది ఆర్టీసీ కార్మికులు స్థానిక ఒంగోలు ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదానం చేశారు.
ప్రమాద రహిత డ్రైవర్లు వీరే..
ఒంగోలు రీజియన్ : మార్కాపురం డిపో డ్రైవర్ ఎస్.జబ్బార్(29 ఏళ్ల అనుభవం), పొదిలి డిపో డ్రైవర్లు ఈ.కోటయ్య(28), ఎడిఎం.వలి(28)