కొత్త జిల్లాలు.. ప్రారంభించే నేతలు వీరే!
హైదరాబాద్: దసరా పండుగ నుంచే తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీకి చెందిన ముఖ్య నేతలకు జిల్లాలను ప్రారంభించే బాధ్యతలు కేసీఆర్ అప్పగించారు. కొత్త జిల్లాల కార్యచరణలో భాగంగా దసరా పండుగరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు. అదేవిధంగా పార్టీ నేతలు వారు పాల్గొని ప్రారంభించనున్న జిల్లాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జిల్లాలు ప్రారంభించనున్న మంత్రులు
సిద్దిపేట సీఎం కేసీఆర్
భూపాలపల్లి స్పీకర్ మధుసూదనాచారి
జగిత్యాల డిప్యూటీ సీఎం మహముద్ అలీ
వరంగల్ రూరల్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
యాదాద్రి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
జనగామ మండలి చైర్మన్ స్వామిగౌడ్
పెద్దపల్లి ఈటల రాజేందర్
కామారెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి
మంచిర్యాల టి.పద్మారావు
వికారాబాద్ పి.మహేందర్ రెడ్డి
సిరిసిల్ల కేటీఆర్
ఆసిఫాబాద్ జోగు రామన్న
సూర్యాపేట జి.జగదీశ్ రెడ్డి
కొత్తగూడెం తుమ్మల నాగేశ్వరరావు
నిర్మల్ ఎ.ఇంద్రకరణ్ రెడ్డి
గద్వాల తలసాని శ్రీనివాస్ యాదవ్
నాగర్ కర్నూల్ సి.లక్ష్మారెడ్డి
మహబుబాబాద్ అజ్మీరా చందూలాల్
వనపర్తి జూపల్లి కృష్ణారావు
మల్కాజ్ గిరి సీఎస్ రాజీవ్ శర్మ(అధికారి)