భయోత్పాతం సృష్టిస్తున్నారు: తమ్మినేని
Published Thu, Oct 6 2016 3:40 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
సూర్యాపేట: ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి దాని ద్వారా భయోత్పాతం సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన సీపీఎం రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలు గురువారం ముగిసాయి. సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన తమ్మినేని మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటు ఇష్టారాజ్యంగా సాగుతోందని.. వీటివల్ల ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని.. ప్రత్యామ్నాయాభివృద్ధి నమూనా కోసమే సీపీఎం మహాజన పాదయాత్ర నిర్వహిస్తోందని తెలిపారు. ఈ నెల 17 నుంచి ఐదు నెలల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement