ఏలూరు: గత కొంత కాలంగా పలు చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు మంగళవారం అరెస్ట్ పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కొవ్వూరు తాలుకా తాళ్లపూడి గ్రామంలో అతడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 28 కాసులు బంగారంతోపాటు రూ. 5.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు దొంగపై పలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.