కొట్టుకొచ్చిందా..! | Threft cars sales in district | Sakshi
Sakshi News home page

కొట్టుకొచ్చిందా..!

Published Sat, Sep 9 2017 7:45 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

కొట్టుకొచ్చిందా..! - Sakshi

కొట్టుకొచ్చిందా..!

జిల్లాలో జోరుగా దొంగకార్ల విక్రయాలు
మోసపోతున్న కొనుగోలుదారులు
పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
తాజాగా జెడ్పీ తాత్కాలిక ఉద్యోగి పరార్‌
జాగ్రత్త పడాలంటున్న అధికారులు


జిల్లాలో చోరీ కార్ల విక్రయాల ఘటనలు నమోదవుతున్నాయి. వాహన విక్రయ ఏజెంట్లు తమ వద్దకు కార్ల కోసం వచ్చే అమాయకులను బురిడి కొట్టించి వారి వద్ద గల చోరీ కార్లను అంటగడుతూ మోసాలకు పాల్ప డుతున్నారు. అనంతరం ఆ కారు కొట్టుకువచ్చింది కావటంతో అసలు యాజమానులు వాటిని తీసుకెళ్తున్నారు. దాంతో బాధితులు కారు, డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బ న్‌): జెడ్పీ కార్యాలయంలో పని చేసే తాత్కాలిక ఉద్యోగి పాలకుర్తి వెంకటే శం, గంగాస్థాన్‌కు చెందిన ముజీబ్‌ సె కండ్‌హ్యాండ్‌ వాహనా లు విక్రయిస్తుం టా రు. ఆర్నెళ్ల క్రితం ఎల్లమ్మగుట్టకు చెందిన రాజేందర్‌ వెంకటేశం నుంచి రూ. 9 లక్షలకు ఇన్నోవా కారు కొ న్నాడు. దీనికి నకిలీ పత్రాలు సృష్టించి మరీ అమ్మాడు. మహారాష్ట్రలోని జాల్నాలో ఇన్నోవా కారును చోరీ చేసిన ముజీ బ్‌ను జాల్నా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కారు ఎవరికి విక్రయించా రో అడ్రస్‌ తెలుసుకున్నారు. నెల క్రితం జాల్నా పోలీసులు జిల్లా కేంద్రాని కి వచ్చి రాజేందర్‌ కొన్న ఇన్నోవా కారును తీసుకెళ్లడంతో అవాక్కయ్యారు.

వెంట నే వెంకటేశంకు ఫోన్‌ చేసి తమ డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో తనకేమి తెలియదని బుకా యించి పరా రయ్యాడు. దీంతో బాధితు డు నాల్గోటౌన్‌ పోలీసులను ఆశ్రయించి మోసంపై ఫిర్యాదు చేశాడు. కారు అమ్మిన వెంకటేశం కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. నెల రోజులుగా అతడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నా డు. బా ధితుడు తన డబ్బులు ఇప్పిం చాలంటూ పోలీస్‌స్టేషన్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు.

మేనమామకు అల్లుడి బురిడీ..
శివాజీనగర్‌కు చెందిన దాసరి శ్రీనివాస్‌ తన మేనమామ రాజా గంగారాంనకు మాయమాటలు చెప్పి మారుతి కారును మరొకరికి విక్రయించాడు. మారుతి కారు కొన్న వ్యక్తి ఆర్‌సీ బుక్‌ కోసం శ్రీనివాస్‌ను అడిగిన ప్రతిసారి ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు. చివరికి కారు కొన్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కారు నంబరు ఆధారంగా పోలీసులు రాజా గంగా రాంను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా తన కారును శ్రీని వాస్‌ తనకు తెలియకుండా అమ్మాడని చెప్పటంతో పోలీసులు శ్రీనివాస్‌పై కేసు పెట్టిఅరెస్టు చేశారు. అనంతరం కారును తిరిగి గంగారాంనకు ఇప్పించారు.

ఆర్సీ బుక్‌ ఇవ్వకుండా..
గత జూన్‌ 3న కార్లు విక్రయించే చింత రాజేందర్‌ వద్ద మార ప్రభు ఫోర్టు ఫిస్టా కారును రూ.2.55లక్షలకు కొన్నాడు. ఆర్‌సీ బుక్‌ అతడికి ఇవ్వలేదు. దీంతో ఈ కారు చోరీ చేసినదిగా గుర్తించారు. దీనిపై నాల్గో టౌన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన డబ్బులు తనకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించటంతో పోలీసులు ఈ కేసు విచారణ సాగిస్తున్నారు.

కొనుగోలులో జాగ్రత్తలు అవసరం..
జిల్లా కేంద్రంలో సెకండ్‌హ్యాండ్‌ వాహనాలు విక్రయించే ముఠాలు ఉన్నాయి. ఇవి పక్క రాష్ట్రాల్లో వాహనాలు చోరీ చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రజలు తాము కొనుగోలు చేసే సెకండ్‌హ్యాండ్‌ వాహనాల అన్ని పత్రాలు సరిగ్గా ఉంటేనే కొనుగో లు చేయాలి. కొందరు మోసగాళ్లు ఆర్‌టీఏ అ ధికారులను సైతం మోసం చేస్తూ నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇలా చోరీ చేసిన వాహనా లు ఎప్పుడైనా బయటపడే అవకాశం ఉంది. సెకండ్‌హ్యాండ్‌ వాహనాల కొనుగోలుపై విక్రయించేవారికి గుర్తింపు ఉంటేనే కొనుగోలు చేయాలి.    
– సుభాష్‌ చంద్రబోస్, నగర సీఐ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement