- దామెర పీహెచ్‌సీ వివాదంపై
- మళ్లీ విచారణ
- మహిళా
- ఉద్యోగికి ఇబ్బందులు
- ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు
విమర్శలకు తావిస్తున్న నిర్ణయాలు
Published Sun, Oct 2 2016 12:16 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
రామన్నపేట : వైద్య, ఆరోగ్య శాఖలో మహిళా సిబ్బం దిపై వేధింపుల విషయంలో ఉన్నతాధికారుల నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడు, మహిళా సిబ్బందిని వేధిం చినట్లు ఉన్నతాధికారులే నిర్ధారించి చర్యల కోసం ఉత్తర్వులు జారీ చేసిన నెలల తర్వాత ఇదే అంశంలో మరోసారి విచారణ జరపాలని నిర్ణయం తీసుకోవడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వైద్యు లు, ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కింది స్థాయి మహిళా ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఆత్మకూరు మండలం దామెర పీహెచ్‌సీ వివాదంపై వైద్య ఆరో గ్య శాఖ జాయింట్ డైరెక్టర్(ఎపిడమిక్) సుబ్బలక్ష్మీ శనివారం విచారణ చేపట్టారు. ఇందులో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన డాక్టర్ గోపాల్‌రావు అసభ్యకరంగా ప్రవరిస్తూ, వేధింపులకు గురిచేశారని మహిళా ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది ఆయనను ఈ ఏడాది మార్చి నెలల్లో నిలదీశారు. గోపాలరావు ఆ సమయంలో క్షమాపణ చెప్పా రు. ఆ తర్వాత అదే తరహాలో వ్యహరిస్తూ సెల్‌మెసేజ్‌లతో వేధింపులకు పాల్పడుతుండడం తో మహిళా ఫార్మసిస్టు ఈ ఏడాది మార్చి 22న జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకు ఫిర్యాదు చేసింది. ఫార్మాసిస్టు అభియోగాలపై విచారణ కోసం అదనపు జిల్లా వైద్యాధికారి శ్రీరాం, డాక్టర్ పద్మజలను నియమిస్తూ జిల్లా వైద్యాధికారి నిర్ణయం తీసుకున్నారు. దామెర పీహెచ్‌సీలో ఈ ఏడాది మార్చి 31న అధికారులు విచారణ నిర్వహించి జిల్లా వైద్యాధికారికి నివేదిక అందజేశారు. ఈ అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరు కార్యాలయానికి జిల్లా వైద్యాధికారి నివేదిక పంపారు. అనంతరం డాక్టర్ గోపాల్‌రావును సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫార్మాసిస్టును పీహెచ్‌సీ నుంచి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తుర్వులు జారీ చేశారు. అన్యాయం జరిగిందని తాను చేసిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి వైద్యుడిని సస్పెండ్ చేసిన అధికారులు తనను బదిలీ చేయడం ఏమిటని ఫార్మసిస్టు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.ఆమె బదిలీని నిలిపివేస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులు చేసింది. దామెర పీహెచ్‌సీ ఘటనలో ట్రిబ్యునల్ నిర్ణయంతో కొందరు వైద్యులు కొత్త ప్రణాళిక రచించారు.
వైద్యుడిపై ఫిర్యాదు చేసిన మహిళా ఫార్మసిస్టును బదిలీ చేయించాలనే ఉద్దేశంతో ఈ అంశంపై మళ్లీ విచారణ జరిపిం చాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. విచారణ అధికారులు తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని, మళ్లీ విచారణ జరపాలని డాక్టర్ గోపాలరావు కోరడంతో దీనిపై పునఃవిచారణకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో జెడీ సుబ్బలక్ష్మీ శనివారం వరంగల్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించా రు. పీహెచ్‌సీలో పని చేస్తున్న మొత్తం సిబ్బం దిని విచారించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని దామెర పీహెచ్‌సీలో విచారణ జరపకపోవడంపైనా చర్చ జరుగుతోంది. విచారణతో సంబంధలేని ఒక ప్రభుత్వ వైద్యుడు ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు అక్కడే ఉండడం విమర్శలకు తావిస్తోంది.
కింది స్థాయి వారికి న్యాయం జరగదా?
పీహెచ్‌సీ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి మహిళా సిబ్బందికి న్యాయం జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక శాఖలో మహిళకు ఇబ్బంది అయినప్పుడు ఐదుగురితో ఒక కమిటీ వేయాలి. ఈ కమిటీలో కచ్చితంగా ముగ్గురు మహిళలు ఉండాలి. జిల్లాలో ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు. మొదటిసారి విచారణ నిర్వహించిన సమయంలో ఫార్మసిస్టు. డీఎంహెచ్‌వోను, ఆరోగ్య శాఖ డైరెక్టరును కలిశారు. వైద్యుడి మానసిక ఆరోగ్య పరిస్థితి తీరు సరిగాలేదని రాజీ చేసుకోవాలని ఇద్దరు ఉన్నతాధికారులు ఫార్మసిస్టుకు చెప్పారు. ఇలాంటప్పుడు మళ్లీ విచారణ ఏమిటి, విచారణ తీరు ఇలా ఉంటే కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రారు.
– జానపట్ల సునీత, జిల్లా అధ్యక్షురాలు,
మెడికల్ హెల్త్ ఉమె¯ŒS అసోసియేష¯ŒS
Advertisement