పిడుగు పడి మహిళ దుర్మరణం
Published Tue, Nov 1 2016 2:14 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
లింగపాలెం : పిడుగు పడి ఓమహిళ దుర్మరణం పాలైంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం లింగపాలెం మండలం వేములపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కనిపెడ శ్యామల(29), మాదాసు రాధ, నత్తా అనురాధ ఆదివారం పొలంలో కూలి పనికి వెళ్లారు. పనిచేస్తుండగా వర్షం పడటంతో చెట్టు పక్కకు వెళ్లి నిలబడ్డారు. సమీపంలో పిడుగు పడడంతో శ్యామల అక్కడికక్కడే మృతి చెందింది. రాధ, అనురాధ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థాని కులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement