నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ,పక్కన ఎమ్మెల్యే,మేయర్,ఎమ్మెల్సీ
-
ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్
-
రూ.7.50 కోట్లతో పనులకు శంకుస్థాపన
ఖమ్మం :ఖమ్మం నగరంలో మెరుగైన వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దుతామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, నగర మేయర్ పాపాలాల్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్లలో రూ.7.50 కోట్ల నిధులతో చేపట్టినవివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ నూతన పాలక మండలి ఏర్పాటు తర్వాత అభివృద్ధి కోసం ప్రతి డివిజన్‌కు రూ.30 లక్షలు కేటాయించామన్నారు. వరదయ్యనగర్, తుమ్మలగడ్డ మసీద్, నిజాంపేట, బ్యాంక్‌కాలనీ, జర్నలిస్టు కాలనీ, సరితా క్లినిక్, జెండాల సెంటర్, రేవతి సెంటర్, చెరువు కట్టబజార్, మామిళ్లగూడెం, రమణగుట్ట, ధంసలాపురం, సెయింట్‌మేరీస్ స్కూల్‌రోడ్, శ్రీనివాసనగర్, బోస్‌సెంటర్, గాంధీనగర్, బురదరాఘవాపురం, జూబ్లీపుర, ఖానాపురం ప్రాంతాల్లోసీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ రోజు ఈ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేశామని చెప్పారు.మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ నగరంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేషన్ నిధులు కేటాయించామని వివరించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ నగరంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి డివిజన్‌లోని రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, బీజీ క్లెమెంట్, గాదె ధనలక్ష్మి, మీరాబేగం, శశికళ, శీలంశెట్టి రమ, బుర్రి కృష్ణవేణి, సుజాత, నిరీష, పాపారావు, జయమ్మ, నీరజ, రుద్రగాని శ్రీదేవి, రూడావత్ రమాదేవి, తోట ఉమారాణి, వాణి, హనుమాన్, నాగరాజు, చావా నారాయణరావు, కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ ఎంపీ ఆంజనేయప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.