అనంతపురం ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఈనెల 21 మండలస్థాయి పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన 12 అంశాలపై ఈ పోటీలు నిర్వహించాలని, ప్రతి అంశం నుంచి ముగ్గురు చొప్పున తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో వేర్వేరుగా విజేతలను ఎంపిక చేయాలని సూచించారు. 23న జిల్లాస్థాయిలో అనంతపురంలోని సైన్స్ సెంటర్‌లో నిర్వహించే పోటీలకు పంపాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో పై అంశాలతో పాటు ‘కృష్ణా పుష్కరాలు’ అనే అంశంపై ప్రత్యేకంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయని వెల్లడించారు.
రేపు మండల స్థాయి పోటీలు
Published Sat, Aug 20 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
Advertisement
Advertisement